BigTV English

Tomatoes : 8 నెలలైనా.. టమాటాల దరిచేరని ఫంగస్..

Tomatoes : 8 నెలలైనా.. టమాటాల దరిచేరని ఫంగస్..
Tomatoes

Tomatoes : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో గల్లంతైన రెండు టమేటోలు తిరిగి దొరికాయన్న వార్తలు ఇటీవల ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టింది. ఎప్పుడో 8 నెలల క్రితం దొరకకుండాపోయిన అవి మళ్లీ లభ్యం కావడం వింతే. ఇన్ని నెలలైనా ఆ టమేటోల్లో ఎలాంటి ఫంగస్ లేదా సూక్ష్మజీవుల పెరుగుదల కనిపించకపోవడం శాస్త్రవేత్తలను మరింత ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.


మట్టి, ఇతర వృద్ధి మాధ్యమాల సాయం లేకుండా మొక్కలను పెంచే క్రమంలో ఎక్స్‌రూట్స్(eXposed Root On-Orbit Test System-XROOTS) ప్రయోగాన్ని నాసా 2022లో చేపట్టింది. హైడ్రోపోనిక్, ఏరోపోనిక్ పద్ధతుల ద్వారా నాసా ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ రూబియో ఆ టమేటోలను పండించారు. మూన్, మార్స్ వంటి భవిష్యత్తు స్పేస్ ప్రయోగాల దృష్ట్యా మొక్కల పెంపకంపై నాసా పరిశోధనలు చేపట్టింది.

రూబియో పండించిన టమేటోల్లో రెండు గల్లంతై 8 నెలల తర్వాత దొరకడం, అవీ చెడిపోకుండా ఉండటం ఆసక్తి రేపుతోంది. కాకపోతే ఆ టమేటోల్లో నీటి పరిమాణం తగ్గిపోయి కొంత రంగు మారిపోయి మెత్తబడినట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ అదే భూమిపై అవి అంతకాలం నిల్వ ఉండటం అసాధ్యం.


అంతరిక్ష వాతావరణంలో 8 నెలలైనా టమేటోలు చెక్కుచెదరకపోవడం, సూక్ష్మజీవులు ఏవీ వాటిలో చేరకపోవడం ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టిని ఆకట్టుకుంది. ఆ రెండు టమేటోలను భూమికి పంపే ఆలోచన ఏదీ లేదని నాసా తెలిపింది. ఐఎస్‌ఎస్‌లో మొక్కల పెంపకంపై పరిశోధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Related News

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Big Stories

×