BigTV English

Golriz Ghahraman | న్యూజిల్యాండ్ ఎంపీ రాజీనామా.. షాపులో దొంగతనం చేసిందని ఆరోపణలు..

Golriz Ghahraman | న్యూజిల్యాండ్‌‌కు వేరే దేశం నుంచి వలస వచ్చి లా చదువుకొని ఎంపీగా ఎన్నికైన తొలి వలసదారు మహిళ ‘గోల్ రిజ్ ఘారమన్'(42) మంగళవారం రాజీనామా చేశారు. ఆమెపై ఒక షాపులో బట్టలు దొంగలించిదనే ఆరోపణలు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దొంగతనం కేసులో పోలీసులు తనని విచారణ చేస్తున్నారని ఆమె వెల్లడించారు.

స్థానిక మీడియా ప్రకారం ఘారమన్‌పై ఫ్యాషన్ దుస్తుల షాపులలో మూడు సార్లు దొంగతనం చేసిందనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల గురించి ఆమె మాట్లాడుతూ.. ”నేను నా అలవాట్ల గురించి పూర్తిగా వివరించలేను. రాజకీయ నాయకులు, ప్రజా నేతలకు ఉండాల్సిన లక్షణాలు నాలో లేవని నేను భావిస్తున్నాను. నా మానసిక ఆరోగ్యం సరిగా లేదు. అందుకు నేను చికిత్స తీసుకునేందుకు సమయం కావాలి,” అని అన్నారు.

మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఆమె తనకు తెలీకుండానే ఇలాంటి పనులు చేస్తోందని.. వీటి వల్ల తన పరువు పోతోందని చెప్పారు. ”నాకు ఇదొక అలవాటుగా మారిపోయింది. నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను” అని వివరించారు.

ఇరాన్ నుంచి వలస వచ్చిన గోల్ రిజ్ ఘరామన్‌ కుటుంబానికి న్యూజిల్యాండ్‌లో పొలిటకల్ అసైలమ్ పొందింది. ఘరామన్ చిన్నప్పటి నుంచి న్యూజిల్యాండ్‌లోనే చదువుకున్నారు. ఆమె అక్కడే లా పూర్తిచేసుకొని.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల లాయర్‌గా పనిచేశారు. 2017లో ఆమె న్యూజిల్యాండ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2023 సంవత్సరంలో ఆమె ఆక్‌ల్యాండ్ లగ్జరీ క్లాతింగ్ స్టోర్, వెల్లింగ్టన్ క్లోత్స్ షాపులో దొంగతనం చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమె గత వారం తన పదవికి రాజీనామా చేశారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×