E-Paper
Advertisement

Kuno National Park : కునో పార్కులో ఆగని చీతాల మరణాలు.. మరొకటి మృత్యువాత..

Kuno National Park :  కునో పార్కులో ఆగని చీతాల మరణాలు.. మరొకటి మృత్యువాత..
Advertisement

Kuno National Park : నమీబియా నుంచి దేశానికి తీసుకొచ్చిన మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటివరకు 10 చీతాలు మరణించాయి. తాజాగా మధ్యప్రదేశ్‌ లోని కునో నేషషల్ పార్కులో మరో చీతా మరణించింది. నమీబియా నుంచి తెచ్చిన శౌర్య అనే చీతా మంగళవారం మృతి చెందిందని అధికారులు ప్రకటించారు.

మంగళవారం ఉదయం చీతా నడవడానికిి ఇబ్బంది పడటాన్ని ట్రాకింగ్‌ బృందం గుర్తించింది. బలహీనంగా ఉన్న ఆ చీతాకు చికిత్స అందించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో చీతా చనిపోయిందని అధికారులు వెల్లడించారు. పోస్ట్‌మార్టం తర్వాతే చీతా మరణానికి గల కారణాలపై క్లారిటీ వస్తుందన్నారు.

Advertisement

అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ‘ప్రాజెక్టు చీతా’ను చేపట్టింది. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. ఆ చీతాలను కునో నేషనల్‌ పార్క్‌లో వదిలారు.

ఇందులో తొలుత ఆరు చీతాలు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయాయి. గతేడాది మార్చిలో జ్వాల అనే మరో నమీబియా చీతాకు నాలుగు కూనలు పుట్టాయి. అంందులో మూడు అనారోగ్య కారణాలతోనే మృత్యువాతపడ్డాయి. తాజాగా మరో చీతా మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన చీతాల సంఖ్య 10కి చేరింది.

Related News

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

Big Stories

Advertisement
×