Big Stories

Israel-Hamas Conflict: సైన్యం దూసుకొస్తే.. బందీలను కాల్చివేయండి: హమాస్ హెచ్చరిక..!

Israel-Hamas Conflict: ఇజ్రాయిల్ బందీలను విడిపించడమే లక్ష్యంగా గాజాలో.. తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలోనే హమాస్ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చింది. ఇటీవల హమాస్ చెరలో ఉన్న నలుగురు బందీలను విడిపించేందుకు ఇజ్రాయిల్ నిర్వహించిన ఆపరేషన్‌లో స్థానికంగా భారీగా ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హమాస్ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చినట్లు అంతర్జాతీయ మీడయా కథనాలు వెల్లడించాయి.

- Advertisement -

టెల్ అవీవ్ దశాలు ముందుకు చొచ్చుకు వచ్చేందకు ప్రయత్నిస్తే బందీలను కాల్చి వేయాలని తమ దళాలకు అగ్ర నేతల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. గత అక్టోబర్ నెలలో ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు.

- Advertisement -

నవంబర్‌లో ఇరు పక్షాల నడుమ కాల్పులు విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్‌లో చెరలో ఉన్నారని ఇజ్రాయిల్ భావిస్తోంది. గాజాలోని సొరంగాల్లో, జనం తిరగని ప్రదేశంలో వారిని ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం వారిని కాపాడటం టెల్ అవీవ్‌కు సవాల్‌గా మారుతోంది. అయితే వారిని గుర్తించేందుకు డ్రోన్లు, శాటిలైట్లలో ఇజ్రాయిల్, అమెరికా నిఘా విభాగాలు, మిలటరీ నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

Also Read: కిమ్ ‘చెత్త’ పనులకు సౌత్ కొరియా రివేంజ్..

గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల పిలుపునిస్తూ.. అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐరాస భద్రతా మండలి ఆమోదించింది. 14 ఓట్లు అనుకూలంగా రాగా..రష్యా ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఈ ప్రణాళికకు ఇజ్రాయిల్ అంగీకరించింది. అయితే దీనికి సంబంధించి ఇంకా హమాస్ అంగీకారం తెలపాల్సి ఉంది. తాము గాజాలో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ఇప్పటికే ప్రకటించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News