BigTV English

NEET-UG 2024 Paper Leak: నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశం.. ఎన్టీయేకు సుప్రీం నోటీసులు..! 

NEET-UG 2024 Paper Leak: నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశం.. ఎన్టీయేకు సుప్రీం నోటీసులు..! 

Supreme Court Sent Notification to NTA on NEET-UG 2024 Paper Leak: నీట్ యూజీ పరీక్ష 2024 పేపర్ లీక్ అంశం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ పేపర్ లీక్ అంశం సుప్రీం కోర్టుకెక్కింది. 2024 నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పలువురు అత్యున్నత న్యాయస్థానాన్ని సంపద్రించారు. ఈ కేసును విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్‌ మంగళవారం ఈ కేసును విచారించింది.


విచారణ తర్వాత సుప్రీం కోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)కి నోటీసులు జారీ చేసింది. అయితే పలువురు కౌన్సిలింగ్ మీద స్టే విధించాలని కోరగా సుప్రీం కోర్టు అందుకు నిరాకరించింది.

మే 5వ తేదీన నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యూజీలో రికార్డు స్థాయిలో 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంకు సాధించారు. వీరిలో ఒకే సెంటర్ నుంచి ఆరుగురు విద్యార్థలు ఉండటంతో అనుమానాలకు దారి తీసింది.


Also Read: Parliament Sessions: జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు: కిరణ్ రిజిజు

నీట్-యూజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో 1,500 మందికి పైగా అభ్యర్థులకు లభించిన గ్రేస్ మార్కులను సమీక్షించడానికి విద్యా మంత్రిత్వ శాఖ నలుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు శనివారం NTA ప్రకటించింది. పరీక్షలో 67 మంది అభ్యర్థులు మొదటి ర్యాంక్‌ను పంచుకోవడానికి దారితీసిన గ్రేస్ మార్కులకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

మాజీ UPSC ఛైర్మన్ నేతృత్వంలోని ప్యానెల్ ఒక వారంలోపు తన సిఫార్సులను సమర్పిస్తుందని.. అవసరమైతే అభ్యర్థుల ఫలితాలను సవరించవచ్చని NTA డైరక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు

ఈ గ్రేస్ మార్కుల అంశం పరీక్ష అర్హత్ ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం చూపలేదని, అలాగే ప్రభావిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్ ప్రక్రియపై ఎటువంటి ప్రభావం చూపదని సుబోధ్ కుమార్ స్పష్టం చేశారు.

Also Read: నీట్ పేపర్ లీక్ విషయంలో కీలక నిర్ణయం

ఇక ఈ పేపర్ లీక్, గ్రేస్ మార్కుల అంశంపై స్పందించిన NTA.. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగలేదని తెలిపింది. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేయటం, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం హై స్కోరింగ్‌కు కారాణలుగా చెప్పుకొచ్చింది.

Related News

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Metro Fare Hikes: ప్రయాణికులకు షాక్.. సడన్‌గా చార్జీలు పెంచిన మెట్రో

Rahul Mamkootathil: సినీ నటి ఆరోపణలు.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్

Heavy Rains: దేశాన్ని వణికిస్తున్న వాన బీభత్సం.. విద్యాసంస్థలకు సెలవులు

Delhi News: ఢిల్లీ సీఎం రేఖాపై దాడి కేసు.. తీగలాగితే డొంక కదులుతోంది, కొత్త విషయాలు బయటకు

Big Stories

×