Soft Chapati: చాలా మంది చపాతీలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ప్రస్తుత కాలంలో వచ్చే జబ్బులకు అందరూ నైట్ చపాతీలను తినడం అలవాటు చేసుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా అన్నం తినడం మానేసి చపాతీలను ఎక్కువగా తింటున్నారు. అయితే చాలా మంది చపాతీలను ఎంత మెత్తగా చేద్దామన్నా అవి కొంచెం గట్టిగా వస్తుంటాయి. మెత్తగా రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎలా చేసిన అవి మాత్రం గట్టిగానే వస్తుంటాయి. అయితే చపాతీలు మృదువుగా, మెత్తగా రావడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
పెరుగు..
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది. పెరుగులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక చాలా మంది పెరుగును రకరకాలుగా ఉపయోగిస్తారు. చపాతీలు మెత్తగా రావాలంటే ముందుగా చపాతీ పిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండు మొత్తం కలిసేలా పిండిని బాగా కలుపుకోవాలి. అలాగే చపాతీ పిండిలో కొద్దిగా పెరుగు లేదా మజ్జిగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగా పిండిని కలుపుకోవడం వల్ల చపాతీలు కూడా మంచిగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని కొద్దిసేపటి వరకు పక్కకు ఉంచాలి. దీని తర్వాత బాగా నానిన పిండితో చపాతీలు చేసుకుంటే అవి మెత్తగా వస్తాయి.
పాలు..
పాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఎన్నో లాభాలను అందిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే ఈ పాలు తాగడానికే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు. పిండిని కలిపై సమయంలో ముందుగా కొన్ని పాలు వేసి బాగా కలుపుకోవాలి. మీకు వీలు అయితే మొత్తం పాలు పోసి కలుపుకోవచ్చు లేదా కొన్ని పాలు పోసి తర్వాత సరిపడినన్ని నీరు పోసి పిండిని ముద్దలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు రుచికరంగా. మెత్తగా ఉంటాయి.
గోరు వెచ్చని నీరు..
రోజూ ఉదయాన్నే గ్లాసు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరం నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయితే చపాతీ పిండిలో అందరు చల్లని నీటిని వాడతారు.. కానీ గోరు వెచ్చని నీటిని వాడటం వల్ల చపాతీలు మెత్తగా, సాఫ్ట్‌గా వస్తాయి. అయితే చపాతీలు చేసినవెమ్మటే కాల్చాలి. లేదంటే చపాతీలు గట్టిపడతాయి.
Also Read: అచ్చెన్నాయుడి అడ్డాలో జగన్ జెండా! సాధ్యమేనా?
చక్కెర..
మనం చక్కెరను అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. అయితే ఇప్పుడు చక్కెరను ఇలా కూడా ఉపయోగిస్తున్నారు తెలుసా.. చపాతీ పిండిని కలిపే సమయంలో రెండు స్పూన్ల చక్కెర పొడిని తీసుకోవాలి. దానిని పిండి కలిపే సమయంలో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నూనె, ఉప్పు వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంతే ఇక చపాతీలు మెత్తగా దూదిలా, పొరలు పొరలుగా వస్తాయి.
ఇంకేందుకు లేటు మీకు చపాతీలు మెత్తగా, రుచికరంగా రావలంటే ఈ చిట్కాలను తక్షణమే ట్రై చేయండి.