BigTV English

Christmas Santa: భలే భలే.. శాంటా తాత..

Christmas Santa: భలే భలే.. శాంటా తాత..
Santa Claus
Santa Claus

Christmas Santa: క్రిస్మస్ వేడుకల్లో హడావుడి అంతా శాంటా క్లాజ్ తాతదే. ఆయన వచ్చాడంటే ఎన్నో బహుమతులు తీసుకొస్తాడనే భావన విశ్వవ్యాప్తంగా ఉంది. క్రిస్మస్ ముందు రోజు ఆయన ధృవపు జింక బండిలో ఆకాశం నుంచి వచ్చి తమకు గిఫ్టులు, మిఠాయిలు ఇచ్చి వెళ్తాడని అందరూ విశ్వసిస్తారు. అందుకోసం తమ ఇళ్ల ముందు క్రిస్మస్ ట్రీకి మేజోళ్లను వేలాడదీస్తారు కూడా. శాంటా తాత వాటిలో గిఫ్టులు వేసి వెళ్తాడనేది ఓ నమ్మకం.


క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణ కూడా శాంటా తాతే. మంచి మంచి బహుమతులు తెచ్చి ఇస్తాడు కాబట్టే ఆ తాత అంటే చిన్న పిల్లలకు అత్యంత ఇష్టం. పొడవైన తెల్లటి గడ్డం, ఎర్రటి దుస్తులు, ముఖంపై చిరునవ్వుతో ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. జింగిల్ బెల్స్..జింగిల్ బెల్స్.. జింగిల్ ఆల్ ది వే విన్పించిందంటే శాంటానే గుర్తుకొస్తారు. వాస్తవానికి శాంటా క్లాజ్ అనేది బైబిల్ పాత్ర కానే కాదనే విషయం తెలుసా? బైబిల్‌లో ఆయన ప్రస్తావనే లేదు.

శాంటా క్లాజ్ ప్రాచుర్యంలోకి వచ్చింది 18వ శతాబ్దం చివర్లో. న్యూయార్క్ పత్రికలో ఆ తాతయ్య ప్రస్తావన వచ్చింది. అయితే అలాంటి మనిషి చరిత్రలో అప్పటికే ఉన్నట్టు తెలుస్తోంది. పేరు సెయింట్ నికోలస్. క్రీస్తుశకం 280లో టర్కీలో నివసించాడు. ఆయనో బిషప్. క్రిస్మస్ రోజు అందరిలోనూ ఆనందాన్ని చూడాలనే సదాశయంతో పండుగకు ముందు పేదవారికి, పిల్లలకు సహాయం చేసేవాడు.


ఎవరైనా నిద్రిస్తుంటే వారి పక్కనే పైసలు, కానుకలు పెట్టి వెళ్లిపోయేవాడు. పిల్లలకు నచ్చే బహుమతులు ఇచ్చేవాడు. అతడి మరణానంతరం చాలామంది ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు. నాటి నికోలస్ పాత్రే కాలక్రమంలో శాంటా‌క్లాజ్‌గా మారినట్టు చెబుతారు.

1930 కన్నా ముందు శాంటా క్లాజ్ ధరించే దుస్తులు నీలం రంగులో ఉండేవి. మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా ప్రస్తుత ఎరుపు, తెలుపు వర్ణాలొచ్చాయి. 1930లో కోకాకోలా కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఈ రంగులను వాడాయి. అవి ప్రాచుర్యం పొందటంతో శాంటా‌క్లాజ్‌కు ప్రతిరూపంగా ఆ రంగులు స్థిరపడిపోయాయి.

1849 వరకు శాంటా క్లాజ్ అవివాహితుడే. ఆ ఏడాది అమెరికన్ రచయిత జేమ్స్ రీస్ చిట్టి కథ ‘ది క్రిస్మస్ లెజెండ్’తో మిసెస్ క్లాస్ రంగప్రవేశం చేసింది. ఇక తెల్లటి గుబురు గెడ్డంతో శాంటాక్లాజ్‌కు రూపును ఇచ్చింది పొలిటికల్ కార్టూనిస్ట్ థామస్ నాస్ట్. శాంటా పాత్రతో బైబిల్‌కు సంబంధం లేకపోయినా.. అందరినీ ఆదుకోవడమే లక్ష్యంగా నాడు సెయింట్ నికోలస్ ఆరంభించిన సంప్రదాయం మంచిదైనందునే శాంటాక్లాజ్ తాతయ్య ఇప్పటికీ మన మనసుల నుంచి చెదిరిపోవడం లేదు.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×