KTR Swedapatram : తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకా ఉందని.. అది అబద్ధాల పుట్ట అని ఆయన ఆరోపించారు. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలోని ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ కేటీఆర్ తెలంగాణభవన్‌లో ‘స్వేదపత్రం’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిస శ్వేతపత్రం అంకెల గారడీ అని.. అభాండాల చిట్టా అని ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు.. విమర్శలకు అసెంబ్లీలో ధీటుగా సమాధానం ఇచ్చామన్నారు కేటీఆర్.
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేశారని కేటీఆర్ పేర్కొన్నారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం.. విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం నుంచి సమృద్ధివైపు తెలంగాణ అడుగులు వేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొందన్న సంగతిని గుర్తుచేశారు.
ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ ఉద్యమ స్పూర్తిని చాటిచెప్పాడు.
తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.3.17 లక్షల కోట్లు కాగా.. దీన్ని కాంగ్రెస్ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆరోపించారు.