BigTV English

Houthi Attack Israel | ఇజ్రాయెల్‌పై క్షిపణి ప్రయోగించిన మరో ఉగ్రవాద సంస్థ.. ఆరుగురు మృతి

Houthi Attack Israel : ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో మరో ఉగ్రవాద సంస్థ హౌతీ శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్‌పై పలు క్షిపణులను ప్రయోగించింది.

Houthi Attack Israel | ఇజ్రాయెల్‌పై క్షిపణి ప్రయోగించిన మరో ఉగ్రవాద సంస్థ.. ఆరుగురు మృతి

Houthi Attack Israel : ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో మరో ఉగ్రవాద సంస్థ హౌతీ శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్‌పై పలు క్షిపణులను ప్రయోగించింది. కానీ ఈ క్షిపణులు ఇజ్రాయెల్‌ సరిహద్దులు దాటి ఈజిప్టులో పడ్డాయి. ఈ దాడిలో అక్కడ చాలా మంది సైనికులు గాయపడ్డారు.


ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో ఉగ్రవాద హమాస్‌కు మద్దతుగా మరిన్ని ఉగ్రవాద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో క్షిపణులను ప్రయోగించడం మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా, యెమెన్‌ దేశ ఉగ్రవాద సంస్థ హౌతీ శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్‌పై పలు క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆరోపించింది. కానీ ఈ క్షిపణులు ఇజ్రాయెల్‌ సరిహద్దులు దాటి ఈజిప్టులోని టాబా ప్రాంతంలో పడ్డాయి. ఈ క్షిపణి దాడిలో అక్కడ ఆరుగరు భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ దాడిని ఖండిస్తూ ఈజిప్ట్‌తో సహా పలు దేశాలు హౌతీ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.


ఇజ్రాయెల్ ప్రభుత్వం తనపై జరిగిన ఈ దాడికి సంబంధించి ఇరాన్, అంతర్జాతీయ ఏజెన్సీలను వివరణ కోరింది. తమ దేశానికి హాని కలిగించే ఉద్దేశంతో హౌతీ ఉగ్రవాద సంస్థ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌ల వల్ల ఈజిప్టు భద్రతా దళాలకు జరిగిన నష్టాన్ని ఖండిస్తున్నామని ఇజ్రాయెల్ తెలిపింది.

ఇజ్రాయేల్ సైన్యాధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ ఉగ్రవాద సంస్థ హౌతీ.. ఇంతకుముందు కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించింది. కానీ ఆ దాడిని అమెరికా యుద్ధనౌక విఫలం చేసింది.

ఈ మొత్తం వ్యవహారంపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ పాట్రిక్‌ రైడర్‌ కూడా స్పందించారు. హౌతీ ఉగ్రవాదులు ప్రయోగించిన మూడు ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణులు, అనేక డ్రోన్‌లు కూల్చివేయబడ్డాయని ప్యాట్రిక్ తెలిపారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×