BigTV English

Houthi Attacks : హౌతీ దాడులు.. గ్లోబల్ ట్రేడ్ కుదేలు!

Houthi Attacks : హౌతీ దాడులు.. గ్లోబల్ ట్రేడ్ కుదేలు!
Houthi Attacks

Houthi Attacks : ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈ మార్గంలో పయనించే వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకుని హౌతీ రెబెల్స్ మూడు నెలలుగా విరుచుకుపడుతున్నారు. ఫలితంగా గ్లోబల్ ట్రేడ్ 1.3% మేర పడిపోయింది. ఎర్రసముద్రం మీదుగా ప్రస్తుతం రోజుకు 2 లక్షల కంటెయినర్ల రవాణా జరుగుతోంది. నవంబర్‌లో ఈ సంఖ్య 5 లక్షలని జర్మనీకి చెందిన ఓ ఆర్థిక అధ్యయన సంస్థ వెల్లడించింది.


దాడుల ఫలితంగా నౌకల రూటు మారింది. ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా రెడ్ సీ, సూయిజ్ కాల్వ అయితే 18,520 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లాల్సి రావడంతో ఈ దూరం 25,002 కిలోమీటర్లకి చేరింది. అంటే అదనంగా 6,752 కిలోమీటర్లు ప్రయాణించాలన్న మాట.

అయినా.. మియాస్క్(Maersk), హపగ్ లాయడ్(Hapag-Lloyd) వంటి షిప్పింగ్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ నౌకలను ఈ మార్గంలోనే పంపుతున్నాయి. దీని వల్ల దూరం పెరగడమే కాదు.. అధిక సమయం కూడా తీసుకుంటుంది. డైవర్షన్ కారణంగా దాదాపు 8.5 రోజుల సమయం ఎక్కువ తీసుకుంటుంది. జర్మనీ, ఈయూ దేశాల అంతర్జాతీయ వాణిజ్యం తగ్గడానికి ఇది కూడా కారణమే.


మరోవైపు, రవాణా చేయాల్సిన సరుకు నిల్వలు రేవుల్లో నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజా ఉద్రిక్తతల కారణంగా బెర్లిన్‌లోని టెస్లా కార్ల ఉత్పత్తికి బ్రేక్ పడింది. విడి పరికరాలు అందని కారణంగా ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఎగుమతులు 2% క్షీణించగా.. దిగుమతులు 3.1% మేర తగ్గాయి. అమెరికాకు రెడ్ సీ సముద్ర వాణిజ్య మార్గం అంత కీలకం కాకున్నా.. ఆ దేశం ఎగుమతులు 1.5% , దిగుమతులు 1% మేర తగ్గిపోయాయి.

చైనా ఎగుమతులు, దిగుమతులకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేకున్నా.. కొత్త సంవత్సరం (ఫిబ్రవరి 10)నాటికి డ్రాగన్ దేశానికి కూడా ప్రతికూలతలు తప్పవని వాణిజ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 2% పెరిగాయి. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 15% ఎర్ర సముద్రం ద్వారానే జరుగుతోంది. 8% ఆహారధాన్యాలు, 12% ఆయిల్, 8% సహజవాయువు రవాణా జరుగుతోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×