BigTV English
Advertisement

Amazon forest : అమెజాన్‌ అడవుల్లో అతి పురాతన నగరం.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

Amazon forest : అమెజాన్‌ అడవుల్లో అతి పురాతన నగరం.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

Amazon forest : 2000 సంవత్సరాల క్రితం కనుమరుగైన అతి పురాతనమైన నగరం వెలుగులోకి వచ్చింది. అమెజాన్‌ అడవుల్లో ఆ నగరాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 2000 సంవత్సరాల క్రితం అత్యంత రద్దీగా ఆ ప్రాంతం ఉండేది. తర్వాత ఆ ప్రాంతం మరుగున పడిపోయింది.


ఈక్వెడార్‌లో పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ నగరాన్ని గుర్తించినట్లు ది జర్నల్‌ సైన్స్‌ పత్రిక పేర్కొంది. ఇరవై ఏళ్ల క్రితం స్టీఫెన్‌ రోస్టైన్‌ అనే శాస్త్రవేత్త ఇక్కడ మట్టిదిబ్బలు, పూడుకుపోయిన రోడ్లను గుర్తించారు. కానీ అక్కడ నగరం ఉంటుందని ఆయన ఊహించలేదు. 2015లో లేజర్‌ సాంకేతికతతో ఆ ప్రాంతాన్ని విశ్లేషించారు. తాజాగా ఆ ఫలితాలను ప్రచురించారు.

ఒకప్పుడు ప్రాంతంలో రోడ్లను కలుపుతూ జనావాసాల నెట్‌వర్క్‌ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 500 బీసీ కాలం నుంచి 300-600 ఏడీ కాలం వరకు ఉపానో ప్రజలు ఇక్కడ జీవించారని నిర్ధారించారు. వారు ఇళ్లను చెక్కతో నిర్మించారని భావిస్తున్నారు. స్థానికులు మట్టి దిబ్బలపై 6,000 ఇళ్లు, భవనాలు నిర్మించారని.. చూట్టూ వ్యవసాయ క్షేత్రాలుండేవని చెపుతున్నారు.


ఆ ప్రాంతంలో రోడ్లు 33 అడుగుల వెడల్పుతో దాదాపు 20 కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు ఆధారాలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ కనీసం 10,000 నుంచి 30,000 మంది నివసించేవారని ఆంటోనే డోరిసన్‌ అనే శాస్త్రవేత్త అంచనా వేశారు. దాదాపు 1,000 ఏళ్ల క్రితం ఈ నగరం అదృశ్యమైనట్టు భావిస్తున్నారు.

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×