E-Paper
Advertisement

Telugu Serials : ఈ వారం టాప్ సీరియల్స్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Telugu Serials : ఈ వారం టాప్ సీరియల్స్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?
Advertisement

Telugu Serials : ఒకప్పుడు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వచ్చేవి.. కానీ ఇటీవల కాలంలో మాత్రం సీరియల్స్ కి డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతూ వస్తుంది. గత కొద్దిరోజులుగా టీవీ చానల్స్ కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాయి. తెలుగు చానల్స్ పోటీపడి మరి కొత్త సీరియల్స్ ని అందిస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లాంటి ప్రముఖ చానల్స్ సీరియల్స్ ని ఎక్కువగా అందిస్తూ జనాలని ఎంటర్టైన్ చేస్తున్నాయి. మరి సినిమాలకు ఏ విధంగా బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఉంటాయో అదే విధంగా సీరియల్స్ కి కూడా టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది. మరి ఈవారం టిఆర్పి రేటింగ్ ఏ సీరియల్కు ఎక్కువగా ఉంది? టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది అన్నది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

సీరియల్ టీఆర్పీ రేటింగ్.. 

ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ రోజురోజుకీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంటున్నాయి. గడిచిన రెండు మూడు నెలల్లోనే బోలెడు సీరియల్స్ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసాయి. మరి ఈ వారం కూడా టీఆర్పి రేటింగ్ విషయంలో సీరియల్స్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా దూసుకుపోతున్నాయి అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈవారం టిఆర్పి రేటింగ్ విషయానికి వస్తే కార్తీకదీపం అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ రెండు కూడా పోటా పోటీగా ముందుకు సాగుతున్నాయి అని అర్థమవుతుంది. అందరికీ షాక్ ఇచ్చేలా ఈ వారం కార్తీకదీపం అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఓకే టిఆర్పి రేటింగ్ ని నమోదు చేసుకున్నయని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పోటీలో ఉన్న రెండు సీరియల్స్ ఒకే టీఆర్పీ రేటింగ్ నీ నమోదు చేసుకోవడం విశేషం.. ఈ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ విషయానికి వస్తే 12.36గా నమోదయింది.

టాక్ ఆఫ్ ది సీరియల్..?

Advertisement

ఇక టిఆర్పి రేటింగ్స్ అన్నది పక్కన పెడితే ఈవారం టాక్ ఆఫ్ ది సీరియల్ విషయానికి వస్తే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈవారం మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. శ్రీవల్లి బాగోతం బయటపడటంతో పాటుగా ప్రేమ పెళ్లి కూడా మరోసారి అంగరంగ వైభవంగా జరగడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రేమ ధీరజుల పెళ్లి తర్వాత శ్రీవల్లి బండారం మొత్తం రామరాజుకు తెలియడం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ఈ సీరియల్ ఈవారం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం. వల్లి మీ ఇంట్లో నుంచి బయటకు పంపించిన తర్వాత చందు చాలా సంతోషంగా ఉంటాడు కానీ మళ్ళీ మాత్రం తన భర్త తనకు దూరమయ్యాడు అని ఫిక్స్ అవుతుంది. ఇకముందు ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా నిన్న మొన్నటి వరకు డల్లుగా ఉన్నాయి ఈ సీరియల్ స్టోరీ ఇప్పుడు ఒక్కసారిగా పెరగడంతో జనాలు దీని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. మరి వచ్చేవారం ఏ సీరియల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తాయో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: పాపం చందు.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. భాగ్యం పై వల్లి సీరియస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి కనిపెడుతుందా..?

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఎండ్ కార్డు..

Podarillu chakri : ‘ పొదరిల్లు ‘ చక్రీ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పునకాలే.. ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలే..

జిమ్‌లో దివి సందడి.. ఇష్టమైన వ్యక్తితో వర్కౌట్స్, లేటెస్ట్ వీడియో వైరల్!

బషీర్ మాస్టర్ సంపాదన మామూలుగా లేదుగా.. ఏకంగా సినిమా బడ్జెట్!

Big Stories

Advertisement
×