E-Paper
Advertisement

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు
Advertisement

El Niño: స్వేచ్ఛ బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగం, గృహావసరాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా పటిష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

అధికారులకు దిశానిర్దేశం

Advertisement

ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంగళవారం ప్రజాభవన్‌లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఆకస్మిక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు, సరఫరా సంసిద్ధత, బొగ్గు లభ్యత, అవసరమైన వనరుల సమీకరణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కరెంట్ కష్టాలు రాకుండా ముందస్తు చర్యలు

Advertisement

వ్యవసాయానికి, గృహావసరాలకు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను తగిన స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైతే కోల్ ఇండియా నుంచి అదనంగా బొగ్గును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బొగ్గు కొనుగోలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని, నిధుల విషయంలో ఎలాంటి కొరత ఉండదని స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు మహర్దశ: ఏ జిల్లాకు ఎన్నెన్ని కోట్లు మంజూరయ్యాయంటే..?

Tags

Related News

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

విద్యార్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌.. రూ.204 కోట్లు విడుదల!

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు మహర్దశ: ఏ జిల్లాకు ఎన్నెన్ని కోట్లు మంజూరయ్యాయంటే..?

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ.5.17 కోట్లు స్వాహా

పేద రైతు ప్రాణాలు బలిగొన్న భూ కబ్జా దందా.. హుజూరాబాద్‌లో సర్పంచ్ భర్త అరాచకాలు!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?

రిమ్స్ ప్రమాదంపై కేటీఆర్ ఫైర్.. ఆసుపత్రి ఘటన వెనుక ఉన్న నిజాలు ఇవే!

Big Stories

Advertisement
×