BigTV English

Bangkok Special  :బ్యాంకాక్.. గురించి మీకెంత తెలుసు?

Bangkok Special  :బ్యాంకాక్.. గురించి మీకెంత తెలుసు?
Bangkok Tour Special

Bangkok Special : థాయ్‌లాండ్ రాజధానిగా, ప్రఖ్యాత టూరిస్టు ప్రదేశాల్లో ఒకటిగా బ్యాంకాక్ తెలుసు. అయితే.. దీని పేరు, చరిత్ర గురించి మనకు తెలియని బోలెడు విషయాలున్నాయి. వాటిలో కొన్ని మీకోసం.. మ‌నం బ్యాంకాక్ అని పిలిచే ఆ దేశం పూర్తిపేరు.. ‘క్రుంగ్‌ థెప్‌ మహా నాఖోన్‌ అమోన్‌ రతన కోసిన్‌మహింత్రయుత్తయ మహ దిలోక్‌ పోప్‌ నప్ప రాట్‌ రటచా థాని బురి రోమ్‌ ఉడొమ్‌ రటాచ నివెట్‌ మహా సతాన్‌ అమోన్‌ ఫిమన్‌ అవటాన్‌ సట్‌హిట్‌ సఖ తాట్టియా విట్సనుకమ్‌ ప్రసిట్‌’ ఈ పేరుకు అర్థం.. దేవ‌దూత‌ల న‌గ‌రం, అమ‌ర‌త్వం పొందిన న‌గ‌రం, 9 ర‌త్నాల అద్భుత‌ న‌గ‌రం, చ‌క్రవర్తి సింహాస‌నం, రాజ‌భ‌వంతుల న‌గ‌రం, మాన‌వ‌రూపంలో వెలసిన దేవ‌తా గృహం, ఇంద్రుడి ఆదేశంపై విశ్వకర్మ నిర్మించిన న‌గ‌రం.


1850లో కింగ్ మాంగ్‌కుట్ బ్యాంకాక్‌కు ఈ పొడవైన పేరు పెట్టారు. ఇందులోని పదాలు పాళి, సంస్కృత భాష‌ల్లోనివి.
నాటి సియా రాజ్యంలో ఇదో చిన్న ప‌ల్లెటూరు. చావో ఫ్రాయా న‌దీతీరాన గల ఈ ఊరు 15వ శ‌తాబ్దం నుంచి పెరుగుతూ పోయింది. 1782లో ఫుత్తయోత్ఫా చౌల‌లోక్ (కింగ్ రామా- 1) దీనిని రాజధానిగా ప్రకటించారు.

1833 నాటికి దీని పేరు ‘సియా – యుతియా’గా మారింది. అంత‌ర్జాతీయ ఒప్పందాల్లోనూ ఆ పేరే వాడారు. ప్రపంచంలో అత్యంత పొడవైన పేరున్న రాజధానిగా ఇది గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. నేటికీ.. అక్కడి స్థానికులు దీనిని మొత్తం పేరుతో కాకుండా.. కుదించి ‘క్రుంగ్‌థెప్ మ‌హానిఖోన్’ లేదా ‘క్రుంగ్‌థెప్’ అనే పిలుస్తారు.


Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×