OTT Movie : స్కాట్లాండ్‌లోని ఒక అందమైన ద్వీపంలోకి, డాక్టర్ టోరా హామిల్టన్, తన భర్తతో కలిసి వస్తుంది. అక్కడ ఒక శవం బయటపడి కలకలం సృష్టిస్తుంది. ఆ శవం చెక్కిన గాయాలు, గుండె లేని ఛాతీతో ఉంటుంది. ఇది ఒక భయంకరమైన కల్ట్ కు చెందిన పనిగా తెలుస్తుంది. టోరా ఈ రహస్యాన్ని కనిపెట్టాలని అనుకుంటుంది. ఆ తరువాత స్టోరీ ఊహకందని ట్విస్టులతో సాగుతుంది. ఇంతకీ ఆ కల్ట్ ఆచారాలు ఏమిటి ? టోరా ఈ రహస్యాలను బయటపెడుతుందా ? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
డాక్టర్ టోరా హామిల్టన్ ఒక గైనకాలజిస్ట్ వైద్యురాలు. ఆమె భర్త డంకన్ స్కాట్లాండ్‌కు 100 మైళ్ల దూరంలో ఉన్న షెట్‌లాండ్ దీవులకు కొత్తగా లైఫ్ ని స్టార్ట్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ జంట అక్కడికి వెళతారు. టోరాకి నాలుగు సార్లు గర్భస్రావం అవుతుంది. ఆ తర్వాత ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని ఆశిస్తుంది. డంకన్‌కు ఆ దీవిలో బలమైన కుటుంబ వంశం ఉంది. అక్కడికి వెళ్ళాక తమ కొత్త ఇంటి పరిసరాల్లో ఒక చనిపోయిన గుర్రాన్ని ఈ జంట చూస్తారు. ఇక దానిని పాతిపెట్టే సమయంలో, టోరా ఒక యువతి శవాన్ని కనిపెడుతుంది. ఆ శరీరంపై రూన్ గుర్తులు చెక్కబడి ఉంటాయి. అంతే కాకుండా గుండె కూడా తీసివేయబడి ఉంటుంది. ఆమె వైద్య నైపుణ్యంతో, ఈ శవం ఒక పురాతన శరీరం కాదని, గత మూడు సంవత్సరాలలో హత్య చేయబడిన ఒక మహిళదని తెలుసుకుంటుంది. ఆమె ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చిందని గుర్తిస్తుంది. అయితే ఇది ద్వీపంలోని స్థానిక ఆచారాలు, ఒక పురాతన కల్ట్‌కు సంబంధించినది. ఇది ‘కునల్-ట్రోస్’ అనే సూపర్‌హ్యూమన్ జాతి గురించిన ఇతిహాసంతో ముడిపడి ఉంటుంది.
ఇప్పుడు టోరా ఈ రహస్యాన్ని దర్యాప్తు చేయడం ప్రారంభిస్తుంది. కానీ ఆమెకు స్థానిక పోలీసులు, డంకన్ కుటుంబం నుండి హెచ్చరికలు వస్తాయి. ఈ విషయాన్ని వదిలేయమని గట్టిగానే చెప్తారు. అయినా కూడా ఆమె భయపడకుండా, దర్యాప్తు చేయడం ప్రారంభిస్తుంది. ఈ దర్యాప్తులో ఆమె భర్త కుటుంబానికి, ద్వీపంలోని శక్తివంతమైన వ్యక్తులతో ఉన్న సంబంధాలు బయటపడతాయి. ఇది ఒక పురుష-ఆధిపత్య కల్ట్ కు సంబంధించినది. స్త్రీలను బ్రీడర్‌లుగా ఉపయోగిస్తూ, బిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిది రోజుల తర్వాత తల్లిని చంపుతారు. టోరా ఈ కల్ట్‌ను ఎదిరించే ప్రమాదకరమైన ప్రయాణంలోకి వెళ్తుంది. చివరికి టోరా ఈ కల్ట్ ని అడ్డుకుంటుందా ? కల్ట్ చేతిలో బలి అవుతుందా ? ఎందుకు వీళ్ళంతా బాలింతలను చంపుతున్నారు ? టోరా భర్తకి ఇందులో సంబంధం ఉందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఓటిటిలో దుమ్మురేపుతున్న తెలుగు హీరో మూవీ… దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్
ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Sacrifice’. ఈ సినిమాకి పీటర్ ఎ. డౌలింగ్ దర్శకత్వం వహించారు.ఇది షారన్ బోల్టన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో రాధా మిచెల్ (టోరా హామిల్టన్), రూపర్ట్ గ్రేవ్స్ (డంకన్), ఇయాన్ మెక్‌ఎల్హిన్నీ (D.I. మెక్‌కీ), జోవాన్ క్రాఫోర్డ్ (సెర్జెంట్ డానా టుల్లోచ్), డేవిడ్ రాబ్ (రిచర్డ్ గుత్రీ) వంటి నటులు నటించారు. Amazon Prime Video, YouTube లలో ఈ సినిమా అందుబాటులో ఉంది. 1 గంట 31 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకు IMDb లో 5.3/10 రేటింగ్ ఉంది.