World Biggest Cruise Ship : ఐకాన్ ఆఫ్ ది సీస్(Icon of the Seas).. ప్రపంచంలోనే అతి పెద్ద క్రూయిజ్ షిప్. వచ్చే నెల నుంచి ఈ నౌక పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. రాయల్ కరేబియన్ గ్రూప్‌కు చెందిన ఈ నౌకలో 5000 వేల మంది ప్రయాణించొచ్చు.
టైటానిక్ కన్నా ఇది ఐదు రెట్లు పెద్దది. పొడవు 1200 అడుగులు. ఐఫిల్ టవర్ ఎత్తు కన్నా ఎక్కువ. బరువు 2,50,800 టన్నులు. టైటానిక్ బరువు 46,329 టన్నులు మాత్రమే. ఆక్వాపార్క్, 20 డెక్‌లు, ఏడు స్విమింగ్ పూల్స్, స్నాక్ బార్స్, లాంజర్స్ వంటి సదుపాయాలెన్నో ఉన్నాయి.
ఈ షిప్‌లో సాహసికుల కోసం ఎన్నో వసతులు ఉన్నాయి. స్కై వాక్ వాటిలో ఒకటి. సముద్రానికి 154 ఎత్తులో స్కైవాక్ చేస్తుంటే ఆ మజాయే వేరు. ఇక డెక్‌పైనే సేదతీరాలనుకుంటే.. వినోదం, ఆనందాలకు కొదవే ఉండదు. మరీ ముఖ్యంగా ఆక్వా డోమ్ వాటర్ ఫాల్ వద్ద. అక్కడ రెస్టారెంట్లు, ఐస్ రింక్, సర్ప్ సిమ్యులేటర్, ఫ్లోరైటర్ వంటివెన్నో అందుబాటులో ఉంటాయి.
ఐకాన్ ఆఫ్ ది సీస్ నౌకలో సముద్రయానం చేయాలనుకునేవారి కోసం అప్పుడే బుకింగ్ లు ఆరంభమయ్యాయి. 2025-26 సంవత్సరానికి కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మియామి నుంచి కరేబియన్ దీవుల వరకు ఏడు రోజుల పాటు యాత్ర ఉంటుంది.