డ్రగ్స్ ముఠాలు వెంటనే సిటీని వదిలి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. పబ్స్ ఫామ్ హౌస్ లలో మత్తు పదార్థాలు వాడితే సహించబోమన్నారు. తన సామర్య్దంపై నమ్మకం ఉంచి పోస్ట్ ఇచ్చిన సీఎంకి హైదరాబాద్ సీపీ ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటిగా చేయాలని సీఎం ఆదేశించారని..ఆ లక్ష్యంతోనే తాను పనిచేస్తాన్నారు. మూడు కమిషనరేట్ల సమన్వయంతో డ్రగ్స్ సమస్యను కూకటివేళ్లతో పెకిలిస్తామని తెలిపారు. పబ్ లు, రెస్టారెంట్, ఫార్మ్ హౌస్ లు, సినీ ఇండస్ట్రీ లలో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని తెలిస్తే ఉక్కుపాదం మోపుతామన్నారు. నిఘా వ్యవస్థ మరింత రెట్టింపు చేస్తామన్నారు హైదరాబాద్ సీపీ. సినీ పరిశ్రమలో డ్రగ్స్ మూలాలను కూకటివేళ్లతో పెకిలిస్తామని సీపీ పేర్కొన్నారు.
హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈమధ్య అవహేళనకు గురైందన్నారు. అదే సమయంలో అందరితో ఫ్రెండ్లీగా ఉండడం నష్టమే అంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చట్టాన్ని గౌరవించేవారితో మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించేవారితో కఠింనంగా వ్వవహరిస్తామని తెలిపారు. ఉద్దేశపూర్వక నేరాలు చేస్తే సహించేది లేదన్నారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.