BigTV English

IDF soldiers killed | వారిలో వారే కాల్చుకున్నారు.. 29 ఇజ్రాయెల్ సైనికులు మృతి

IDF soldiers killed | ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కలిగిన దేశం, ప్రపంచంలోనే అత్యుత్తమ గూఢాచార సంస్థ (మొసాద్) కలిగిన దేశం, ప్రపంచంలోనే అత్యుత్తమ సైనిక దళం ఇంత ఘన కీర్తి ఉన్న ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో ఒక అవమానాన్ని మూటగట్టుకుంది.

IDF soldiers killed | వారిలో వారే కాల్చుకున్నారు.. 29 ఇజ్రాయెల్ సైనికులు మృతి

IDF soldiers killed | ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కలిగిన దేశం, ప్రపంచంలోనే అత్యుత్తమ గూఢాచార సంస్థ (మొసాద్) కలిగిన దేశం, ప్రపంచంలోనే అత్యుత్తమ సైనిక దళం ఇంత ఘన కీర్తి ఉన్న ఇజ్రాయెల్(Israel) తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో ఒక అవమానాన్ని మూటగట్టుకుంది.


తమ పౌరుల ప్రాణాలకు ఎంతో విలువనిచ్చే ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ సైనికులను మాత్రం కాపాడుకోలేకపోతోంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రికలో ప్రచురించిన నివేదిక ప్రకారం హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 170 మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. ఇందులో 17 శాతం అంటే 29 మంది సైనికులు ఫ్రెండ్లీఫైర్(Friendly fire) ఘటనల్లో మరణించారు.

ఫ్రెండ్లీఫైర్ అంటే ప్రమాదవశాత్తు వారిలో వారే కాల్చుకోవడం. మరి కొన్ని సందర్భాలలో 9 మంది సైనికులు కూలిపోయిన భవనాల కింద నలిగి, తుపాకులు ప్రమాదవశాత్తు పేలి, మిలిటరీ వాహనాల కింద పడి చనిపోయారు.


యుద్దం మొదలైనప్పటి నుంచి ప్రతి వారం 2 నుంచి ఆరు మంది ఇజ్రాయెల్ సైనికులు ఇలాంటి ప్రమాదాలలోనే చనిపోతున్నారని సమాచారం. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఇజ్రాయెల్ ఎందుకు ఇలాంటి ప్రమాదాలలో తమ సైనికుల మరణాలను ఆపలేకపోతోందని విమర్శలు ఎదుర్కొంటోంది.

మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 21000 మందికి పైగా గాజావాసులు చనిపోయినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 8000కు పైగా చిన్నపిల్లలే ఉండడం గమనార్హం.

IDF soldiers, killed, friendly fire, accidents, rubble, Gaza, ground operations, deaths, Hamas, Israel,

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×