Big Stories

India fired On Pakistan: ‘పాకిస్తాన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదం’: ఐపీయూలో భారత్ ఫైర్

India Fire On Pakisthan
India Fire On Pakisthan

India Fires on Pakistan: పొరుగు దేశమైన పాకిస్థాన్ పై భారత్ నిప్పుణులు చెరిగింది. పాక్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదులకు మద్దతునిచ్చే చరిత్ర ఉన్న పాకిస్థాన్ అంటూ మండిపడింది. ఈ మేరకు స్విట్జర్లాండ్ జెనివాలో జరిగిన ఐపీయూ (ఇంటర్ పార్లమెంటరీ యూనియన్) 148వ సమావేశంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ భారత్ తరుపున కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

పాకిస్థాన్ లాంటి దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఐపీయూ సమావేశాల్లో భారత్ కీలక ప్రకటన చేసింది. వెంటనే జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ నిర్మిస్తున్న ఉగ్రవాద ఫ్యాక్టరీలను ఆపాలంటూ హెచ్చరించింది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన చరిత్ర పాకిస్థాన్ కు ఉందని మండిపడింది. ఓవైపు పాకిస్థాన్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ పై దాడి చేస్తూనే.. మానవ హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భారత్ పేర్కొంది.

- Advertisement -

ఐపీయూ ప్రాముఖ్యతను ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాకిస్థాన్ తగ్గించకుండా ఉంటే బాగుంటుందని హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. మరోవైపు ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇండియాను చాలా దేశస్తులు ఆదర్శంగా తీసుకుంటున్నారని కూడా హరివంశ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Also Read: AAP Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్.. సోషల్ మీడియా ‘డీపీ క్యాంపెయిన్’ ప్రారంభించిన ఆప్..

పాకిస్థాన్ బాగోతం ఐపీయూ సభ్యులకు బాగా తెలుసని అన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయటం వంటి వాటిల్లో పాకిస్థాన్ కు చరిత్ర ఉందని హరివంశ్ సింగ్ ఐపీయూ వేదికగా ఆరోపించారు. మరోవైపు గ్లోబల్ టెర్రరిస్ట్ అయిన ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్థాన్ పౌరుడే అని గుర్తుచేశారు. ఇక అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్న దేశాల్లో పాకిస్థాన్ రికార్డు ఉందని యూఎన్ భద్రతా మండలి వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

 

జమ్మూ భారత్ లో అంతర్భాగమే అని ఎవరు ఎన్ని చేసినా దానిని మార్చలేరని పేర్కొన్నారు.
మరోవైపు ఇటీవల సింగపూర్ పర్యటనలో ఉగ్రవాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థిలో భారత్ లేదని అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఒక పరిశ్రమ స్థాయిలో ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కావాలని, తప్పించుకుంటే ప్రయోజనం లేకపోదు.. ఎదుర్కోవాలని అన్నారు. పాక్ తో భారత్ సంభందాల కోసం ఉగ్రవాదాన్ని వదిలిపెట్టబోమని తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News