భారత సంతతి వ్యక్తికి లండన్ లో జీవిత ఖైదు పడటం సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో భారత సంసతి వ్యక్తులకు ఈ స్థాయిలో పెద్ద శిక్ష పడటం ఇదే తొలిసారి కావడం విశేషం. మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు 14 ఏళ్లపాటు కఠిన కారాగార శిక్ష విధించింది లండన్ లోని ఐల్ వర్త్ క్రౌన్ కోర్టు.
నవరూప్ సింగ్ అనే 24 ఏళ్ల కుర్రాడు ఈ దారుణానికి ఒడిగట్టడం సంచలనంగా మారింది. భారత సంతతికి చెందిన నవరూప్ సింగ్ తల్లిదండ్రులు చాన్నాళ్ల క్రితమే లండన్ లో సెటిలయ్యారు. నవరూప్ సింగ్ కి చిన్నప్పటి నుంచి నేరప్రవృత్తి ఉంది. మొత్తం అతడిపై ఐదు కేసులున్నాయి. మూడు నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు కేసులు నమోదు చేశారు. నేరం చేయాలనే ఉద్దేశంతోనే అతడు తుపాకీని కొనుగోలు చేశాడు. దాన్ని అడ్డు పెట్టుకుని బెదిరించడం మొదలు పెట్టాడు. మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతోపాటు అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో ఐల్ వర్త్ క్రౌన్ కోర్టు అతడికి 14 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది.
గతేడాగది అక్టోబర్ లో నవరూప్ సింగ్ 20 ఏళ్ల ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సౌతాల్ పార్క్ ప్రాంతంలో నివశించే బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు నవరూప్ సింగ్ కోసం వేట మొదలు పెట్టారు. అయితే లైంగిక నేరాలకు అలవాటు పడ్డ అతడు.. ఆ తర్వాతి రోజు ఓ మైనర్ బాలికను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంట వెంటనే ఒకే ప్రాంతంలో ఒకే తరహా ఘటనలు జరగడంతో పోలీసులు నేరస్తుడు ఒక్కడే అయిఉంటాడని అనుమానించారు. సీసీ టీవీ ఫుటేజీ సాయంతో నవరూప్ సింగ్ ని అరెస్ట్ చేశారు.
మహిళలపై అఘాయిత్యాల విషయంలో లండన్ చట్టాలు కఠినంగా ఉంటాయి. పోలీసులు కూడా ఇలాంటి కేసుల్ని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అత్యాచార ఘటనలు జరిగాయన్న ఫిర్యాదులతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నేరస్తుడిని రోజుల వ్యవధిలోనే పట్టుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీ సాయంతో నవరూప్ సింగ్ ని గుర్తించి, అతడి ఇంటి చుట్టూ నిఘా పెట్టారు. ఆ తర్వాత చుట్టు పక్కల వారు ఇచ్చిన వివరాల మేరకు అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి అతడే నిందితుడని నిర్థారించుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి, విచారణలో అతడే నేరాన్ని చేసినట్టు నిరూపించారు. దీంతో కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ ఘటనతో అటు లండన్ లోని భారతీయ కుటుంబాలు కూడా కలవరపడ్డాయి. భారత సంతతి వ్యక్తులు లండన్ లో నేరాలు చేయడం కానీ, పోలీసులకు చిక్కడం చాలా అరుదు. కానీ నవరూప్ సింగ్ అనే కుర్రాడు మాత్రం వరుస తప్పులు చేసి చివరకు జైలుపాలయ్యాడు.