BigTV English

OTT Movie : అడవి మధ్యలో ఒంటరి అమ్మాయి… అందంగా ఉంది కదాని ఆశపడితే అల్టిమేట్ ట్విస్ట్… క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : అడవి మధ్యలో ఒంటరి అమ్మాయి… అందంగా ఉంది కదాని ఆశపడితే అల్టిమేట్ ట్విస్ట్… క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : థియేటర్లో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టిన ఒక మూవీ, ఓటీటీలో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా స్టోరీ  ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన జీవితంలో ఎదుర్కునే సంఘటనలతో ఈ స్టోరీ తిరుగుతుంది. ఇందులో ఆమె ప్రతి ఒక్కరి చేతిలో మోసపోతుంది. ప్రేమ విషయంలో పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. చివరిలో వచ్చే సీన్స్ కి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి.  ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ అమెరికన్ మిస్టరీ డ్రామా మూవీ పేరు ‘Where the Crawdads Sing.’ 2022 లో వచ్చిన ఈ సినిమాకి ఒలివియా న్యూమాన్ దర్శకత్వం వహించారు. ఇది డీలియా ఓవెన్స్ 2018లో రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో డైసీ ఎడ్గర్-జోన్స్, టేలర్ జాన్ స్మిత్, హ్యారిస్ డికిన్సన్, మైఖేల్ హయాట్, స్టెర్లింగ్ మాసర్ జూనియర్, డేవిడ్ స్ట్రాతైర్న్ వంటి నటులు నటించారు. ఇది ఒక అప్ కమింగ్-ఆఫ్-ఏజ్ కథ. నార్త్ కరోలైనా మార్ష్‌ల్యాండ్స్‌లో జరిగే ఒక మర్డర్ మిస్టరీతో ఈ కథగా రూపొందింది. IMDbలో 7.2/10 రేటింగ్ ఉంది. $24 మిలియన్ బడ్జెట్‌తో $140 మిలియన్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ విజయం సాధించింది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఆరేళ్ల వయసులో కేట్ తన తాగుబోతు తండ్రి కారణంగా, ఆమె తల్లి, అన్నదమ్ములు ఒక్కొక్కరూ ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోతారు.  చివరికి ఆమె తండ్రి కూడా వెళ్లిపోతాడు. కేట్ ఏడేళ్ల వయసులో ఒంటరిగా మిగిలిపోతుంది. ఆమె మార్ష్‌లోని మస్సెల్స్‌ను అమ్మి, స్థానిక జనరల్ స్టోర్ యజమానులైన జంపిన్, మాబెల్ సహాయంతో జీవిస్తుంది. కేట్ స్కూల్ లో తోటి విద్యార్థులతో హేళనకు గురవుతుంది. ఆ తరువాత సమాజం నుండి దూరంగా ఉంటూ,  కేట్ తన అన్న స్నేహితుడైన టేట్ వాకర్ ను కలుస్తుంది. అతను ఆమెకు చదవడం, రాయడం నేర్పిస్తాడు. వారు ప్రకృతి పట్ల ఆసక్తిని పంచుకుంటూ, ప్రేమ బంధంలోకి దిగుతారు. అయితే టేట్ కాలేజీ కోసం సిటీకి వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి వస్తానని ఆమెకు చెప్పి వెళ్లిపోతాడు. అయితే అతను ఎంతకీ తిరిగి రాకపోవడంతో కేట్ హృదయం విరిగిపోతుంది.

ఆ తరువాత కేట్ స్థానిక ఫుట్‌బాల్ స్టార్ చేస్ ఆండ్రూస్ తో సంబంధం పెట్టుకుంటుంది. అతను ఆమెని వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. ఆ తర్వాత అతనికి ఇది వరకే పెళ్ళి జరిగిందని, తనని మోసం చేస్తున్నాడని తెలుస్తుంది. ఒక సారి కేట్ అతన్ని నిలదీయడంతో, చేస్ ఆమెపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తాడు.  కానీ కేట్ అతని నుంచి తప్పించుకుంటుంది.  ఒక రోజు చేస్ ఆండ్రూస్ ఒక ఫైర్ టవర్ దగ్గర చనిపోయినట్లు తెలుస్తుంది. దీనిని పోలీసులు హత్యగా భావిస్తారు. కేట్ అతనితో సంబంధంలో ఉన్న  కారణంగా, ప్రధాన నిందితురాలిగా ఆమెను అరెస్టు చేస్తారు.

ఇంతలో ఆమెను రక్షించడానికి రిటైర్డ్ అటార్నీ టామ్ మిల్టన్ ముందుకు వస్తాడు. కోర్టు విచారణలో, చేస్‌ను హత్య చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేకపోవడం, కేట్ ఆ రాత్రి గ్రీన్‌విల్లేలో ఒక పబ్లిషర్‌ను కలవడానికి వెళ్లినట్లు రుజువు కావడంతో ఆమె నిర్దోషిగా విడుదలవుతుంది. అయితే ఆతరువాత ఎవరూ ఊహించని ఒక సీక్రెట్ బయటపడుతుంది. చివరికి చేస్‌ను హత్య చేసింది ఎవరు ? కేట్ కి ఈ కేసులో నిజంగానే సంబంధం లేదా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : స్క్విడ్ గేమ్ ఎండింగ్ అర్థం కాలేదా? అలాంటి ముగింపు ఇవ్వడానికి కారణాలివే!

Related News

OTT Movie : దేవుడి కోసం వెళ్లి దెయ్యానికి బలి… ముసలాడితో అమ్మాయిలు అడ్డంగా బుక్… మోస్ట్ కాంట్రవర్షియల్ హర్రర్ మూవీ

OTT Movie : అందమైన అమ్మాయే ఈ దెయ్యం టార్గెట్… బెడ్ పై కూడా వదలకుండా… బతికుండగానే నరకం అంటే ఇదే

OTT Movie : ఆల్మోస్ట్ అన్ని దేశాలలో బ్యాన్ చేసిన డేంజరస్ మూవీ… గర్ల్స్, బాయ్స్ ని బంధించి ఇవేం పాడు పనులు సామీ ?

OTT Movie : డేంజరస్ ఐలాండ్… అడుగు పెడితే అబ్బాయిల కోసం పడి చస్తారు… సింగిల్ గా చూడాల్సిన ఏరోటిక్ థ్రిల్లర్

OTT Movie : కిరాయి సైనికుల చేతుల్లోకి ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

OTT Movie : ప్రధానమంత్రి భర్త మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్

Big Stories

×