Big Stories

Gaza Updates: రంజాన్ వేళ ఐరాస భద్రత మండలి తీర్మానం.. గాజాలో కాల్పుల విరమణకు ఆదేశం!

Gaza Updates
Gaza Updates

Gaza Updates: తొలిసారి గాజాలో కాల్పుల విరమణపై ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ మాసం సందర్భంగా గాజాలో కాల్పులు విరమించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి డిమాండ్ చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానంలో హమాస్ లో బందీలై ఉన్న వారిని తక్షణమే విడుదల చేయాలని పేర్కొంది. ఈ తీర్మానానికి భారీ మెజార్టీ లభించింది. 15 సభ్యదేశాల్లో 14 దేశాలు అనుకూలంగా స్పందించాయి. అయితే గతంలో ఎన్ని తీర్మానాలు ప్రవేశపెట్టినా ఆమోదం కాలేదు. వీటో అధికారంతో ఉన్న వ్యతిరేక సభ్యదేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. తాజాగా యుద్ధం మొదలైన 5నెలల తర్వాత కాల్పుల విరమణకు భద్రతా మండలి తీర్మానం ఆమోదించడం ఇదే తొలిసారి.

- Advertisement -

ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానంపై ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భద్రతా మండలి తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలని, కాల్పుల విరమణ పాటించాలని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘5 నెలలుగా ఎదురుచూస్తున్న ఈ తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. రంజాన్ పండుగ సందర్భంగా గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలి. అంతేకాకుండా వెంటనే హమాస్ లో ఉన్న బందీలను విడుదల చేయాలి. తీర్మానాన్ని పాటించకపోతే క్షమించడం కుదరదు’ అని కార్యదర్శి ఆంటోనియో పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: సరిహద్దు విషయంలో మరోసారి నోరు పారేసుకున్న చైనా.. ఈనెలలో ఇది నాలుగోసారి

ఇజ్రాయిల్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సూచన చేశారు. గాజాపై కాల్పులు విరమించాలని కోరారు. ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ మద్దతు తగ్గిపోతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో సూచనలను తప్పక పాటించాలని కోరారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చేసిన తీర్మానంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. భద్రత మండలి తీర్మానాన్ని అమెరికా అడ్డుకోకపోవడంతో పాటు మద్దతు తెలపడంపై నిరాశ వ్యక్తం చేశారు. హమాస్ లో బంధీలైన వారిని విడుదల చేసే నిబంధనలకు అమెరికా అడ్డుకోకుండా సహకరించడంపై ఆయన విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా తీరుపై జాతీయ భద్రతా విభాగ అధికారి జాన్ కిర్బీ మాట్లాడారు. కాల్పుల విరమణ, బందీల విడుదలే తమ డిమాండ్ అన్నారు. కాగా, వాషింగ్టన్ నుంచి తమ రాయబారులను వెనక్కి తీసుకుంటామన్న ఇజ్రాయెల్ హెచ్చరికలను కూడా అమెరికా పట్టనట్లు ఉండడం గమనార్హం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News