BigTV English

Popular Global Leaders: సర్వే వివరాలు.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత ఎవరంటే..?

Popular Global Leaders: సర్వే వివరాలు.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత ఎవరంటే..?

Most Popular Global Leaders: ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉన్నది అనే అంశంపై అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ ర్యాంకింగ్ వివరాలను తాజాగా వెల్లడించింది. వరల్డ్ వైడ్ గా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీనే నిలిచారు.


సర్వేలో 69 శాతం ఓట్లతో మోదీ మొదటి స్థానంలో నిలువగా, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. ఆయనకు 63 శాతం ఓట్లు వచ్చాయి. చిట్ట చివరి స్థానంలో జపాన్ ప్రధాని పుమియో కిషిదా నిలిచారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 39 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 25 మందితో ఈ జాబితాను రూపొందించారు. అయితే, గతంలో కూడా వెల్లడించిన సర్వేల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీనే అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది జులై 8-14 మధ్య ప్రతి దేశంలోనూ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన సర్వే సంస్థ ఈ తాజా జాబితాను విడుదల చేసింది.

Also Read: ట్రంప్ వర్సెస్ కమలాహారిస్.. తొలి డిబేట్‌కు డేట్ ఫిక్స్


సర్వే వివరాలు ఇలా ఉన్నాయి..

ఇండియా పీఎం – నరేంద్ర మోదీ (69 శాతం)
మెక్సికో అధ్యక్షుడు – లోపెజ్ ఒబ్రేడర్ ( 63 శాతం)
అర్జెంటీనా అధ్యక్షుడు – జేవియర్ మిలి (60 శాతం)
స్విట్జర్ లాండ్ అధ్యక్షుడు – వియోల్ అమ్హెర్డ్ (52 శాతం)
ఐర్లాండ్ ప్రధాని – సైమన్ హారిస్ (47 శాతం)
యూకే పీఎం – కీర్ స్టార్మర్ (45 శాతం)
పోలాండ్ పీఎం – డొనాల్డ్ టస్క్ (45 శాతం)
ఆస్ట్రేలియా పీఎం – ఆంథోని అల్బనీస్ (42 శాతం)
స్పెయిన్ పీఎం – పెడ్రో శాంచెజ్ (40 శాతం)
ఇటలీ పీఎం – జార్జియా మెలోని (40 శాతం)
అమెరికా ప్రెసిడెంట్ – జోబైడెన్ (39 శాతం)

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×