BigTV English

BRS: భట్టి విక్రమార్కకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలి.. మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి

BRS: భట్టి విక్రమార్కకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలి.. మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి

Bhatti Vikramarka: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ పై భట్టి విక్రమార్కకు అపారమైన, అద్భుతమైన అవగాహన ఉన్నదని సెటైర్లు వేశారు. కాబట్టి, ఆయనకు కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి పదవి ఇవ్వాలని పేర్కొన్నారు. రూ. 75 కోట్లతో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చునని డిప్యూటీ సీఎం చెబుతున్నారని, ఇదే నిజమైతే ఆయనకు నోబెల ప్రైజ్ కూడా ఇవ్వవచ్చునని సెటైరికల్ కామెంట్ చేశారు. ఇంతటి అనుభవం, అవగాహన ఉన్న భట్టి విక్రమార్క తనకున్న మేధస్సును దేశ నీటిపారుదల రంగం కోసం, దేశవ్యాప్తంగా ఉన్న రైతుల శ్రేయస్సు కోసం ఉపయోగించాలి అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.


అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాదోపవాదాలు, ఆరోపణ ప్రత్యారోపణల పర్వం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ తరుచూ ఆందోళనలకు దిగడంతో పలువురిని మార్షల్స్ పట్టుకెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల గురించి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. నిన్నటి వరకు జరిగినవి బడ్జెట్ సమావేశాలు కావని, వాటిని బుల్డోజ్ చేసేలా సభ నిర్వహించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ తీరుపైనా విమర్శలు గుప్పించారు. సభను కేవలం ఆరు రోజులే సభ జరిపారని పేర్కొన్నారు. తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. తమను మార్షల్స్‌ను పెట్టి బయటికి పంపించారని ఆగ్రహించారు.

Also Read: 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ


అలాగే.. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధానాలు, బిల్లులను ఆయన విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌తో ఒరిగేదేమీ లేదని, అది కేవలం యువతను మభ్యపెట్టే ఉద్దేశంతో తెచ్చిందేనని పేర్కొన్నారు. ైతు భరోసా నిధుల మాటే లేదని మండిపడ్డారు. రుణమాఫీ అంశంపై స్పష్టత లేదని పేర్కొనడం గమనార్హం. తాము సబ్జెక్ట్ మంచిగా మాట్లాడటంతో ప్రభుత్వానికి భయం వేసిందని, అందుకే తమ నోరు నొక్కేశారని ఆరోపణలు గుప్పించారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×