BigTV English

US India Tariff : సుంకాలపై అమెరికాను బుజ్జగిస్తున్న భారత్.. యుస్ వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గింపు

US India Tariff : సుంకాలపై అమెరికాను బుజ్జగిస్తున్న భారత్.. యుస్ వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గింపు

US India Tariff | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ఉద్దేశిస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా తెలివైన వ్యక్తి అని, మోదీ తనకు మంచి స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చేశారు. “మోదీ ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి. మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య మంచి చర్చలు జరిగాయి. అవి ఇరుదేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నా,” అని ట్రంప్ చెప్పారు.


ట్రంప్ ఇంకా భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీకు గొప్ప ప్రధాని ఉన్నారు. ఆ దేశంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ, ఆ దేశంతో నాకున్న ఏకైక సమస్య సుంకాలు (Tariffs). ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధించే దేశాలలో ఇండియా ఒకటి. వారు బహుశా వాటిని గణనీయంగా తగ్గించబోతున్నారని నమ్ముతున్నా. అయితే ఏప్రిల్ 2న వారు మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలుచేస్తే, నేను వారి నుంచి అంతే వసూలు చేస్తా,” అని అన్నారు.

సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్
అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు.  పలు దేశాలపై పరస్పర టారిఫ్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మిత్ర దేశాలు, శత్రు దేశాలు అని తేడా లేకుండా సుంకాల మోత మోగిస్తున్నారు. అమెరికాకు ముఖ్యంగా మెక్సికో, కెనడా,  భారత్, చైనా నుంచి వస్తువులు దిగుమతి అవుతుంటాయి. ఈ నాలుగు దేశాల్లో భారత్ మినహా మూడింటిపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు.


Also Read:  భారతీయులకు షాకిచ్చిన అమెరికా ఎంబసీ .. 2000 మంది వీసా దరఖాస్తులు రద్దు

ఈ నేపథ్యంలో అమెరికా-భారత్ వాణిజ్యంలో కూడా టారిఫ్‌లు పెంచడానికి ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై అమెరికా విధించే సుంకాలు అమల్లోకి రానున్నాయి. కెనడా, చైనాలు టారిఫ్ పెంపుపై పెద్దగా స్పందించకపోయినా భారత్ మాత్రం ఇప్పటికే అమెరికాను బుజ్జగించే చర్యలు ప్రారంభించింది.

అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న 23 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో సగానికి పైగా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని భారత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సుంకాల తగ్గింపుపై భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా అసిస్టెంట్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ బ్రెండన్ లించ్‌తో ఇండియా అధికారులు వరుసగా జరిగిన సమావేశంలో అమెరికా నుంచి వచ్చే బోర్బన్ విస్కీ, బాదాం, వాల్‌నట్స్, కాన్‌బెర్రీస్, పిస్తా, పప్పులపై సుంకాలు తగ్గించడానికి భారత్ అంగీకరించింది.

కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి కనిపిస్తుందని, ఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రకటించారు. వ్యవసాయంతో పాటు ఇతర రంగాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల టారిఫ్‌పై భారత్ ఇప్పటికే ఆఫర్లు ప్రకటించింది.

వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు 30 శాతం నుంచి 100 శాతం వరకు ఉన్నాయి. పప్పులపై 10 శాతం వరకు సుంకాలు విధిస్తున్నారు. వీటిని తగ్గించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.

భారత్ ఉత్పత్తులపై ట్రంప్ అధిక సుంకాలు విధించకూడదని..
ప్రస్తుతం భారత్ అమెరికా నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. అయితే చమురు కొనుగోళ్లను 25 బిలియన్ డాలర్లకు పెంచుతామని భారత ప్రభుత్వం  ఇప్పటికే హామీ ఇచ్చింది. అదనంగా, ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కూడా కొనుగోలు చేయడానికి భారత్ చర్చలు కొనసాగిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ డిజిటల్ ప్రకటనలపై 6 శాతం ఉన్న పన్నును రద్దు చేయబోతోందని ఇప్పటికే ఆర్థిక మంత్ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి అమెరికా సంస్థలకు భారీగా లబ్ది చేకూరుతుంది.

భారత్ ఇప్పటికే లగ్జరీ కార్లు, సోలార్ సెల్స్ వంటి వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ టారిఫ్‌ను తగ్గించింది. వీటి గరిష్ట సుంకాలను 150 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×