Manoj Tiwary: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ లో భాగంగా శుక్రవారం రోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సీఎస్కే కి తొలి ఓటమి ఎదురైంది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తన రెండవ మ్యాచ్ లో కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
Also Read: MS Dhoni: ధోని క్రేజీ స్టంప్… క్షణాల్లోనే వికెట్లు గిరాటేశాడు ?
ఆర్సిబి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాలలో సత్తా చాటింది. అనంతరం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. 197 పరుగుల లక్ష్య చేదనలో సీఎస్కే 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు 13 ఓవర్లలోపే సీఎస్కే 80 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో రవీంద్ర జడేజా క్రీజ్ లో ఉన్నాడు. ఆ సమయంలో ఇక మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ కి వస్తాడని అంతా ఊహించారు.
కానీ అనూహ్యంగా రవిచంద్రన్ అశ్విన్ క్రీజ్ లోకి వచ్చాడు. ఇక రవీంద్ర జడేజా 25 పరుగులు చేసిన సమయంలో అశ్విన్ పెవిలియన్ చేరాక.. ఆ సమయంలో ధోనీ క్రీజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తన హిట్టింగ్ లో పవర్ ఇంకా తగ్గలేదని, 43 ఏళ్ల వయసులోనూ అదే జోష్ తో స్టేడియంలోని అభిమానులని ఉర్రూతలూగించాడు. 20 ఓవర్ల పాటు వికెట్ల వెనుక కీపింగ్ చేసి, మళ్లీ బ్యాటింగ్ లోను రాణించడం విశేషం.
కానీ ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి. దీనిపై మాజీ క్రికెటర్లు కూడా అసహనం వ్యక్తం చేశారు. ధోని ఇంకాస్త ముందు వరుసలో బ్యాటింగ్ కి వస్తే బాగుండేదని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడ్డారు. సీఎస్కే ఓటమి ఖాయమైన సమయంలో ధోని బౌండరీలు కొట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనిపై కలకత్తా నైట్ రైడర్స్ మాజీ ఆటగాడు మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Virat Kohli: కోహ్లీపై ట్రోలింగ్… ఐపీఎల్ వద్దు టెస్టులు ఆడుకో అంటూ!
“బ్యాటింగ్ ఆర్డర్ లో ధోనీని ముందుకు వెళ్లాలని చెప్పే ధైర్యం సీఎస్కే కోచింగ్ సిబ్బందికి లేదు. 16 బంతులలో 30 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచిన ధోనీ లాంటి ఆటగాడు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా ఎందుకు వెళ్లకూడదు..? మీరు గెలవడానికే ఆడుతున్నారా..?. ధోని తాను ఆ స్థానంలో ఆడతానని నిర్ణయం తీసుకోవడంతో కోచింగ్ సిబ్బంది కూడా ఏం చేయలేకపోతున్నారు” అని మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్ లో సీఎస్కే ఆడిన తొలి మ్యాచ్ లో కూడా ధోని ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కి దిగాడు. ఇప్పుడు రెండవ మ్యాచ్ లో 9వ స్థానంలో బ్యాటింగ్ కి రావడంతో అభిమానులు కూడా నిరాశకు గురవుతున్నారు.