Turkey President Pakistan| పాకిస్తాన్ తో ఉద్రిక్తల వేళ భారతదేశంలో టర్కీ దేశంపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ రెసిప్ ఎర్డోగాన్ పాకిస్తాన్ కు ఎల్లప్పుడు అండగా నిలబడి ఉంటమాని ప్రకటించడంతో భారతీయుల్లో ఆగ్రహావేశాలు కనబడుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కు ప్రియమైన సోదరుడు అంటూ టర్కీ ప్రెసిడెంట్ బహిరంగంగా పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడం ఇప్పుడు ఇండియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇండియాతో జరిగిన యుద్దంలో పాకిస్తాన్ కు సాయం చేసిన టర్కీ దేశానికి ధన్యవాదాలు తెలుపుతూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాబ్ షరీప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో పాక్ ప్రధాని.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ని ప్రశంసించారు. “కష్టసుఖాల్లో సుదీర్ఘకాలంగా తమకు తోడుగా నిలిచిన టర్కీతో స్నేహ సంబంధాలు కలిగిఉండడంపై పాకిస్తాన్ గర్వపడుతోంది. ముఖ్యంగా ప్రెసిటెంట్ ఎర్డోగాన్ కు దక్షిణాసియా శాంతి కోసం ఆయన చేసే కృషికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని పాక్ ప్రధాని రావారు.
ఈ పోస్ట్‌కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ రిప్లై ఇచ్చారు. “ప్రియమైన సోదరుడు షహబాజ్ తో నా బంధం నిజమైన స్నేహానికి ప్రతీక. పాకిస్తాన్ ఎల్లప్పుడూ కష్టాల్లో, సుఖాల్లో అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా మా బంధం ఇలాగే కొనసాగుతుంది. టర్కీ, పాకిస్తాన్ స్నేహం జిందాబాద్” అని పోస్ట్ లో రాశారు.
పహల్గాం ఉగ్రవాద దాడిలో అమాయకులు చనిపోయిన తరువాత భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరలపై వైమానిక దాడులు చేసింది. ఆ తరువాత ఇండియాపై పాకిస్తాన్ ఆర్మీ ప్రతి దాడులు చేసే సమయంలో టర్కీ నుంచి ఆయుధాలు, డ్రోన్లు, మిసైల్స్ పాకిస్తాన్ కు అందాయి. ఆ మిసైల్స్ తో పాకిస్తాన్.. భారత మిలిటరీ స్థావరాలపై, అమాయక పౌరులపై దాడులు చేసింది. దీంతో భారతీయుల్లో టర్కీ పట్లు తీవ్ర వ్యతిరేకత తలెత్తింది.
టర్కీ, అజెర్‌బైజాన్ ని బహిష్కరించాలి
ఇండియాలో టర్కీ బాయకాట్ నినాదం రోజు రోజుకూ బలం పుంజుకుంటోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ కు అండగా నిలిచిన టర్కీ, అజెర్ బైజాన్ దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులను బహిష్కరించాలని, వాటిపై నిషేధం విధించాలని భారత వ్యాపారుల సంఘం నిర్ణయించింది. ఆ దేశాలకు పర్యటన కోసం కూడా వెళ్లకూడదని పిలుపునిచ్చింది.
రెండేళ్ల క్రితం భూకంప సమయంలో టర్కీ దేశానికి ‘ఆపరేషన్ దోస్త్’ ద్వారా పెద్ద ఎత్తున సహాయం చేసిన భారత్‌కు ఇప్పుడు అదే టర్కీ పెద్ద ద్రోహం చేసింది. పాకిస్తాన్‌కు టర్కీ.. డ్రోన్లు, ఆయుధాలు అందిస్తూ సైనికంగా భారీ మద్దతు ఇస్తోంది. ఇండియా నుంచి ఎగుమతి అయ్యే అనేక కీలక విడి భాగాలతో తయారైన డ్రోన్లను పాక్‌కు సరఫరా చేస్తున్నట్టు సమాచారం.
Also Read: భారత్ విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ సేవలు అందిస్తున్న టర్కీ కంపెనీ.. పాక్‌తో సన్నిహిత సంబంధాలు
దీంతో టర్కీ దేశానికి విమాన భాగాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అల్యూమినియం వంటి ఎగుమతులను నిలిపివేయాలన్న భారతదేశంలో డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతా బాధ్యతలు టర్కీకి చెందిన సెలెబీ సంస్థకు ఉండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇక పాక్‌కు మద్దతుగా టర్కీ వ్యవహరిస్తుండటంపై భారత దేశానికి చెందిన జేఎన్‌యూ (జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ) – టర్కీ వర్సిటీ మధ్య విద్యా ఒప్పందం కూడా రద్దు చేశారు.