BigTV English

Sonia Gandhi: ఇజ్రాయెల్ మారణహోమంలో గాజాలో 55వేల మంది మృతి.. ఇప్పటికైనా మోదీ సర్కార్? : సోనియా గాంధీ

Sonia Gandhi: ఇజ్రాయెల్ మారణహోమంలో గాజాలో 55వేల మంది మృతి.. ఇప్పటికైనా మోదీ సర్కార్? : సోనియా గాంధీ

Sonia Gandhi: ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు దేశాలు పరస్పరం మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ లోని అణు కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ అటాక్ చేస్తోంది. అయితే ఈ వివాదంలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రియాక్ట్ అయ్యారు.


జూన్ 13న ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ అటాక్ చేయడం సరికాదని.. ఇది చట్ట విరుద్ధమని అన్నారు. అలాగే ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతోందని చెప్పారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల వల్ల అమాయక ప్రజలు బలి అవుతున్నారని పేర్కొన్నారు. ఈ దేశాల్లో ప్రమాదకరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయని చెప్పారు. ఇరాన్ గడ్డపై జరిగిన ఈ బాంబు దాడులు, ప్రముఖుల హత్యలను సోనియాగాంధీ ఖండించారు.

గాజా నగరంపై ఇజ్రాయెల్ చేసిన దాడులు క్రూరమైనవిగా వర్ణించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌కు సహకరిస్తుండడంతో.. ఇజ్రాయెల్ దాడులు ఎక్కువయ్యాయని చెప్పారు. పాలస్తీనా – ఇజ్రాయెల్ ప్రజలకు మధ్య 1995 లో జరగాల్సిన శాంతి ఒప్పందం బెంజమిన్ నెతన్యాహూ చేసిన పనులు వల్ల జరగలేకపోయిందని.. దానికి ఆయన అడ్డుపడ్డాడని తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ తీరుపై సోనియాగాంధీ ఫైరయ్యారు. ప్రజెంట్ ట్రంప్ ఇరాక్ ప్రాంతంలో జరిగిన తప్పే.. ఇప్పుడు ఇరాన్‌లో చేస్తున్నట్టు పేర్కొన్నారు.


ALSO READ: Donald Trump: పాక్ పులిహోర.. ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలట, ఇదేం ‘ఎఫైర్’ సామి?

భారత్‌కు రెండు దేశాలతో మంచి సత్సంబంధాలు ఉండడంతో మౌనంగా ఉందని చెప్పారు. ఈ దాడులపై భారత ప్రభుత్వం మానం వీడాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత కొన్నేళ్ల నుంచి భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వాణిజ్య, డిఫెన్స్, ఇంటెలిజెన్స్ బంధాలు జోరుగా కొనసాగుతున్నాయి. అలాగే ఇరాన్ దేశ ప్రజలతో కూడా భారత్ కు బలమైన బంధం ఉందని చెప్పారు. ఇరాన్ దేశం భారత్ కు చిరకాల మిత్రుడని.. 1994లో కశ్మీర్ అంశంలో ఇండియాకు సపోర్టుగా ఉందని గుర్తు  చేశారు. ప్రస్తుతం ఉన్న ఇరాన్ లోని నేతలు మన దేశానికి అండగా ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని చెప్పారు.

ఇరాన్‌తో మన దేశ సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను మరిచి పోవద్దని సూచించారు. ఇరాన్ భారతదేశానికి చాలాసార్లు మద్దతు ఇచ్చిన సన్నిహిత మిత్ర దేశమని.. 1965, 1971 యుద్ధాల సమయంలోఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ భారతదేశంతో సహకరించిందని ఆమె గుర్తు చేశారు. ఇజ్రాయిల్‌తో భారతదేశం బలమైన సంబంధాలను ఉపయోగించి, ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం రాజనీతి చేయాలని సోనియా గాంధీ కోరారు.

ALSO READ: New Baba Vanga Predictions: జపాన్‌లో మరో సునామీ.. ఎప్పుడంటే? బాబా వంగ జోస్యం నిజమా? అబద్దమా?

ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడుల్లో ఇప్పటి వరకు 55వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారని.. అక్కడ పరిస్థితులు అందకారంగా మారాయిని అన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం విషయంలో భారత్ దౌత్య పాత్రను పునరుద్ఘాటించాలని చెప్పారు. భారత్ ఈ విషయంలో జోక్యం చేసుకుని.. బాధ్యతాయుతంగా వ్యవహరించి అక్కడి యుద్ధ పరిస్థితులను మామూలు స్థితికి వచ్చేవరకు  చర్చలను ప్రోత్సహించాలని సోనియాగాంధీ కీలక సూచనలు చేశారు. భారత ప్రభుత్వం సూత్రప్రాయమైన నియమ, నిబంధనలను పూర్తిగా వదిలేసిందని ఆమె చెప్పారు. ఇప్పటికైనా మోదీ సర్కార్ మేల్కొని.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ముందుకురావాలని ఆమె కోరారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×