Viral Video : ఛాన్స్ దొరికితే వదలట్లే. ఫేక్ కంటెంట్‌లో తగ్గేదేలే. ఏది పడితే అది చేయరు. ట్రెండింగ్ ఏంటో చూసుకుంటారు. వైరల్ టాపిక్‌నే ఎంచుకుంటారు. రీల్స్‌తో రెచ్చిపోతుంటారు. రైలు పట్టాలపై పరుగులు, రోడ్లపై ఫ్రాంక్ వీడియోలు ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పడంతా లేటెస్ట్ బర్నింగ్ టాపిక్సే. ఇటీవల అహ్మదాబాద్‌లో విమానం కుప్పకూలి వందలాది మంది చనిపోయారు. ఒకే ఒక్కడు మాత్రం బతికాడు. ఆ ప్రమాదం నుంచి అతను బయటపడటానికి 11A సీటే కారణమని ప్రచారం జరుగుతోంది. ఆ సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు దగ్గరగా ఉంటుందని.. అందుకే అతను తప్పించుకోగలిగాడని కథనాలు అల్లేస్తున్నారు. అప్పటినుంచీ విమానంలో 11A సీటుకు డిమాండ్ పెరిగింది.
ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయింది. ఆ సీటు కోసం ముగ్గురు ప్రయాణీకులు ఫ్లైట్‌లో గొడవ పడుతున్న వీడియో అది. ఒక మహిళ, ఇద్దరు వృద్ధులు. మధ్యలో ఆమె కొడుకు. అరుచుకోవడం, తిట్టుకోవడం, కొడుకును కొట్టడం.. ఆ వీడియో మరాఠీలో ఉన్నా ఫుల్ కామెడీగా ఉంది. 11A సీటు కోసం విమానంలో గొడవ అంటూ హెడ్డింగ్ పెట్టి సోషల్ మీడియాలో వదలడంతో మిలయన్లలో వ్యూస్ వచ్చాయి. ఫుల్‌గా సర్క్యూలేట్ అవుతోంది. కట్ చేస్తే.. అదంతా ఫేక్. సీటు కోసం గొడవ ఫేక్. ఆఖరికి విమానం కూడా ఫేక్. ఫేక్..ఫేక్..ఫేక్. అట్లుంటది మరి సోషల్ మీడియాతోని.
Also Read : మెట్రో రైల్‌లో పాము..పాము.. అమ్మాయిలు పరుగో పరుగు..
ఆ వీడియో అంతా స్క్రిప్టెడ్ అట. ఇన్‌స్టా రీల్ కోసం అలా చేశారట. ఆ వీడియోలు ఉన్నవారంతా నటీనటులేనట. ఆ వర్జినల్ వీడియో బయటకు వచ్చాక అసలు నిజం తెలిసింది. ఇద్దరు వృద్ధులు ఫ్లైట్‌లో మేజిక్ చేస్తున్నారు. ఒకతను చిన్న బాల్ నుంచి పావురాన్ని సృష్టించాడు. అది చూసి విమానంలో ఉన్న వాళ్లంతా చప్పట్లు కొట్టారు. ఆ పావురం ఎగిరి ముందు సీట్లో ఉన్న మహిళ మీద పడింది. ఆ మహిళ ఆ మెజీషియన్‌తో గొడవ పెట్టుకుంది. వాళ్ల మధ్య మాటా మాటా పెరిగింది. మధ్యలో ఎయిర్‌హోస్టెసెస్ వచ్చి సర్ది చెబుతున్నా వినలే. అదీ అసలు అక్కడ క్రియేట్ చేయబడిన సీన్. అదంతా మొబైల్‌లో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి. కానీ, అదే వీడియోను కాస్త అటూఇటూ ఎడిట్ చేసి.. విమానంలో 11A సీటు కోసం గొడవ అంటూ టైటిల్ పెట్టగానే.. నెటిజన్లు ఎగబడి చూసేశారు. లాజిక్కులు లేకుండా నిమిషాల్లోనే వైరల్ చేసేశారు. తీరా అది మేజిక్కు వీడియో అని ఇప్పుడు తెలిసింది. మహిళతో పాటు ఇద్దరు వృద్ధులు కూడా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లేనని తేలింది. ఫ్లైహై ఇన్‌స్టిట్యూట్ సంస్థతో కలిసి.. ఈ ఇన్‌స్టా రీల్ క్రియేట్ చేశారు. చివర్లో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఇదంతా జరిగింది అసలు విమానంలోనే కాదు.. అది ఒక ఏవియేషన్ క్లాస్ రూమ్. బకరా!
Fact Check
విమానంలో ఆ గొడవ నిజం కాదు.. ఒక స్క్రిప్టెడ్ వీడియో!
తమ ఇన్‌స్టా రీల్ కోసం.. ఈ వీడియో సృష్టించిన కంటెంట్ క్రియేటర్స్
మహిళతో పాటు ఇద్దరు వృద్ధులు కూడా ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లే!
ఫ్లైహై ఇన్‌స్టిట్యూట్ సంస్థతో కలిసి.. ఈ ఇన్‌స్టా రీల్ చేసిన క్రియేటర్స్
కొసమెరుపు… https://t.co/pqlhrGXCcb pic.twitter.com/aTBbqk6FuZ
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 21, 2025