BigTV English

Natasha: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారత సంతతి అమ్మాయి

Natasha: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారత సంతతి అమ్మాయి

Natasha: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో భారత సంతతికి చెందిన అమ్మాయి చోటు దక్కించుకుంది. సెంటర్ ఫర్ టాలెంటెడ్(సీటీఐ) యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఇండోఅమెరికన్ నటాషా పెరియనాయగమ్ పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనబర్చింది.


ప్రపంచవ్యాప్తంగా అత్యంత చురుకైన, వయస్సు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన విద్యార్థులను వెలికితీసేందుకు ప్రతిఏటా సీటీఐ పలు పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాల నుంచి 15,300 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. అందులో కేవలం 27 శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించగా.. అందులో నటాషా మొదటి స్థానంలో నలిచి రికార్డ్ సృష్టించింది.

నటాషా న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ స్కూల్లో చదువుతోంది. తమిళనాడులోని చెన్నైకి చెందిన నటాషా తల్లిదండ్రులు ఉద్యోగరిత్యా అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిపోయారు. తాజాగా నిర్వహించిన పోటీల్లో నటాషా పాల్గొని స్కాలాస్టిక్ ఆప్టిట్యూట్ టెస్ట్, ఏటీసీ పరీక్షల్లో అందరికంటే ఎక్కువ స్కోర్ చేసి మొదటి స్థానంలో నిలిచింది.


Tags

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×