BigTV English
Advertisement

India Student Murder in Canada: కెనడాలో భారత విద్యార్థి హత్య.. ప్రధానికి పేరెంట్స్ విజ్ఞప్తి!

India Student Murder in Canada: కెనడాలో భారత విద్యార్థి హత్య.. ప్రధానికి పేరెంట్స్ విజ్ఞప్తి!

Indian Student Murdered in Canada: విదేశాలలో ఉంటోన్న భారత విద్యార్థులు వరుసగా హత్యలకు గురవుతున్నారు. తాజాగా కెనడాలో మరో విద్యార్థి హత్యకు గురయ్యాడు. సౌత్ వాంకోవర్ లో భారత్ కు చెందిన విద్యార్థి చిరాగ్ అంటిల్ (24)ను దుండగులు కాల్చి చంపినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్ 12, శుక్రవారం అర్థరాత్రి సమయంలో 55వ ఈస్ట్ అవెన్యూలోని మెయిన్ స్ట్రీట్ వద్ద కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి వెళ్లి చూశారు. అక్కడ ఉన్న కారులో చిరాగ్ విగతజీవిగా పడి ఉన్నాడని పోలీసులు తెలిపారు.


చిరాగ్ అంటిల్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ వారంలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని తెలిపారు. ఈ కేసులో ఇంతవరకూ అనుమానితులుగా ఎవరినీ గుర్తించలేదు. మృతుడి సోదరుడు రోమిత్ అంటిల్ కు కెనడా పోలీసులు సమాచారమిచ్చారు. అయితే.. దాడికి గల కారణాలు, ఎవరు దాడి చేశారన్నది ఇంకా తెలియలేదని, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు.

తమ కుమారుడి మృతదేహాన్నితిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని చిరాగ్ అంటిల్ తల్లిదండ్రులు ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైషాక్ నార్ లకు విజ్ఞప్తి చేశారు. 2022లో కెనడాకు వెళ్లిన చిరాగ్.. వెస్ట్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఇటీవలే అక్కడ వర్క్ పర్మిట్ పొందాడు. చిరాగ్ పైనే కొండంత ఆశలు పెట్టుకున్నఆ కుటుంబం.. అతని మరణంతో తీరని దుఃఖంలో మునిగిపోయింది. చిరాగ్ తండ్రి మహవీర్ హర్యానా షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయ్యారు.


Also Read: పాకిస్తాన్‌లో సరబ్‌జీత్ సింగ్‌ను చంపిన హంతకుడు దారుణ హత్య

కాగా.. 2024లో ఇప్పటివరకూ ఒక్క అమెరికా దేశంలోనే సుమారు 11 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు ఒక నివేదిక చెబుతోంది. 2022-23 అకడమిక్ ఇయర్ లో 2.6 లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళ్లినట్లు ఆ నివేదిక పేర్కొంది.

Related News

Chicago Clashes: ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై నిరసనలు.. చికాగోలో చిన్నారిపై పెప్పర్ స్ప్రే కొట్టిన పోలీసులు

Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Big Stories

×