BigTV English

Golden Visa: భారతీయులకు గోల్డెన్ వీసా ఆఫర్.. కేవలం 23 లక్షలతో చెల్లిస్తే చాలు

Golden Visa: భారతీయులకు గోల్డెన్ వీసా ఆఫర్.. కేవలం 23 లక్షలతో చెల్లిస్తే చాలు

Golden Visa: అమెరికాలో సెటిలయ్యేందుకు కఠినమైన ఆంక్షలు తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్. దీంతో చాలామంది భారతీయుల దృష్టి గల్ఫ్ దేశాలపై పడింది. తాజాగా భారతీయుల కోసం కొత్తగా గోల్డెన్ వీసాని తీసుకొచ్చింది యూఏఈ. గతంలో ఉన్న కొన్ని నిబంధనలను సడలించింది.  ఇంతకీ ‘గోల్డెన్ వీసా’కు టర్న్స్ అండ్ కండీషన్స్ ఒక్కసారి చూద్దాం.


యూఏఈ ప్రకటించిన గోల్డెన్ వీసాల వెనుక అసలు కథేంటి? ఇప్పటికే యూఏఈ గోల్డెన్ వీసాలకు వివిధ దేశాల నుంచి మాంచి ఆదరణ ఉంది. తాజాగా వివిధ రకాల గోల్డెన్ వీసాలను తెచ్చేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు స్థిరాస్తుల కొనుగోలు, బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే గోల్డెన్ వీసాలను జారీ చేసేది. ప్రస్తుతం వాటిలో కొన్ని నిబంధనలు సడలించినట్టు తెలుస్తోంది.

నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాలను జారీ చేయనుంది. ఈ వీసా పొందాలంటే మన అకౌంట్లో డబ్బులుంటే సరిపోతుంది. అర్హత కలిగిన భారతీయులు AED 100,000 అంటే చాలు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 23.3 లక్షలన్నమాట. ఒకేసారి చెల్లించి గోల్డెన్ వీసాను దక్కించుకోవచ్చు. ఈ పద్దతి ద్వారా రానున్న మూడు నెలల్లో దాదాపు ఐదు వేల మందికి పైగా భారతీయులు దరఖాస్తు చేస్తారని అంచనా వేస్తోంది.


ఫైనాన్స్, బిజినెస్, సైన్స్, స్టార్టప్, ఉద్యోగ సేవలు వంటి రంగాల్లో యూఏఈ మార్కెట్‌కు దరఖాస్తు చేసినవారు ఏ విధంగా ఉపయోగపడతారో తొలుత పరిశీలన చేయనుంది కన్సల్టెన్సీ రయాద్ గ్రూప్. అంతా ఓకే అయితే తుది నిర్ణయం కోసం దరఖాస్తును ప్రభుత్వానికి పంపనుంది. ఈ విషయాన్నిరయాద్ గ్రూప్ ఎండీ రయాద్ కమల్ అయూబ్ తెలిపారు.

ALSO READ: ట్రంప్‌కు బిగ్ షాక్.. అన్నంత పని చేసిన మస్క్

అంతేకాదు మనీలాండరింగ్, క్రిమినల్ రికార్డులు, సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేస్తామన్నది ప్రధానమైన పాయింట్. దరఖాస్తుదారులు స్వదేశం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ పోర్టల్, వన్ వాస్కో కేంద్రాలు, ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

అంతేకాదు గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను దుబాయ్‌కు తీసుకురావచ్చు. వారికి సహాయకులు, డ్రైవర్లను నియమించుకోవచ్చు. స్థానికంగా వ్యాపారం లేదా ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ వీసా జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రాజెక్టు త్వరలో చైనా, ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉందని సమాచారం.

సాంప్రదాయ వీసాల మాదిరిగా కాకుండా కొత్త ప్రక్రియ నామినేషన్లపై ఆధారపడి ఉండనుంది. డబ్బులు కట్టి తీసుకున్నప్పటికీ వ్యక్తుల బ్యాక్‌గ్రౌండ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. UAE లో జీవితాన్ని లీడ్ చేయాలనుకునే భారతీయులకు ఇదొక అద్భుతమైన అవకాశం.

Related News

Pushpa – Trump: ‘పుష్ప’ తరహాలో ఆ దేశానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్.. ఇలా తయారయ్యావేంటి మామ!

Nepal Crisis: నేపాల్ ఆర్మీ వార్నింగ్.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, కొత్త ప్రధాని ఆయనే?

Nepal Agitation: మనుషులను తగలబెట్టేసేంతగా ‘సోషల్ మీడియా’లో ఏం ఉంది? నిబ్బాల చేతిలో నేపాల్?

Nepal: నేపాల్‌లో ఇది పరిస్థితి.. ఆర్థిక మంత్రిని నడిరోడ్డుపై వెంబడించి.. కొడుతూ, తన్నుతూ.. వీడియో వైరల్

Gen Z Movement: దారుణం.. నేపాల్ మాజీ ప్రధాని భార్యను తగలబెట్టేసిన నిరసనకారులు

US-Pak: పాకిస్తాన్ లో అమెరికా ఖనిజాన్వేషణ.. భారత్ కి చెక్ పెట్టేందుకేనా?

Big Stories

×