7 Year Old Dies: హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని ఓ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. వైద్యులు ఆపరేషన్ చేయగా ఏడేళ్ల బాబు మృతి చెండాడు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని టీఎక్స్ హాస్పిటల్‌కు..7ఏళ్ల బాబు కాలుకు వచ్చిన చీమును తొలగించేందుకు పేరెంట్స్ తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సమయంలో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు. బాలుడికి గుండెపోటు వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. బాలుడి పేరెంట్స్ మాత్రం వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. దీంతో హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు.
చిన్న సమస్య.. విషాదాంతం
జహీరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం తమ 7 ఏళ్ల కుమారుడు.. కాలుకు వచ్చిన చీమును తొలగించేందుకు చికిత్స కోసం.. బంజారా హిల్స్‌లోని టీఎక్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఐదు నెలలుగా టీఎక్స్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వైద్యులు ప్రాథమికంగా పరిశీలించి, ఆపరేషన్ ద్వారా ఆ చీమమును తొలగించాల్సిందిగా తెలిపారు. సర్జరీ నిమిత్తం మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు.
ఆపరేషన్ సమయంలో విషమ పరిస్థితి
వైద్యులు వెంటనే బాలుడిని ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. కానీ కొద్ది సేపటికే పరిస్థితి విషమంగా మారింది. హాస్పిటల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ సమయంలో బాలుడికి గుండెపోటు వచ్చిందని, అత్యవసర చికిత్స చేసినా.. ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. బాలుడిని కాపాడలేకపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు వెల్లడించగా.. వారు షాక్‌కు గురయ్యారు.
తల్లిదండ్రుల ఆరోపణలు
అయితే బాలుడి తల్లిదండ్రులు వైద్యుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ ముందు ఏ రకమైన టెస్ట్‌లు చేయలేదని, అనవసరంగా జనరల్ అనస్తీషియా ఇవ్వడంతోనే.. ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బాబు చనిపోయాడని వాదిస్తూ.. హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు.
హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత
బాలుడి మృతదేహాన్ని బయటకు తీసుకురాగానే.. హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్పిటల్ సిబ్బందిపై కుటుంబ సభ్యులు, బంధువులు ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు
కేసు నమోదు – విచారణ ప్రారంభం
బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. హాస్పిటల్ వైద్యులపై కేసు నమోదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడా లేకా.. నిజంగానే గుండెపోటు వచ్చిందా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. హాస్పిటల్ సీసీ టీవీ ఫుటేజ్, చికిత్స వివరాలు, మెడికల్ రిపోర్టులు సేకరించడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.
Also Read: పెళ్లయ్యాక మరొకరితో లవ్.. చివరికి చెట్టుకి వేలాడుతూ.. దారుణం!
ఆత్మవిమర్శ అవసరం
ఒక చిన్న శరీర సమస్య కోసం హాస్పిటల్‌ను ఆశ్రయించిన బాలుడు, చివరకు ప్రాణాలు కోల్పోవడంతో.. ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో జరుగుతున్న వైద్య సేవలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్న సమస్య అయనా, ఎలాంటి అపరేషన్‌కైనా సమగ్ర ప్రాసెసింగ్, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన చెబుతోంది.