Indonesia Rituals: ఇంటి ప్రక్కన ఎవరైనా చనిపోయారా? కొందరికి వచ్చే భయాల తీరే వేరు. అదిగో నీడ, ఇదిగో నీడ అంటూ కొద్దిరోజులు హడలెత్తిపోతారు. కానీ ఇదంతా మూఢనమ్మకం అంటూ కొందరు కొట్టిపారేస్తున్నా, మరికొందరు మాత్రం మా భయాలు మావి అంటుంటారు. అదే చనిపోయిన మనిషి శరీరాన్ని ఏడాది తర్వాత బయటకు తీయండి అంటే, లగెత్తరో అనేస్తారు కొందరు.
అందరూ కాదు కానీ కొందరైతే ఎంచక్కా అలాంటి సాహసాలకు పూనుకుంటారు. అదే ప్రతీ ఏడాది చనిపోయిన వ్యక్తి శరీరాన్ని తీయడం అంటే, మా వల్ల కాదని తెగేసి చెప్పడం మనకు కామన్. కానీ ఓ తెగ జాతి మనుషులు చనిపోయిన శరీరానికి బట్టలు వేసి మరీ తమ మురిపెం తీర్చుకుంటారు. ఇలాంటి వింత సంప్రదాయం ఎక్కడుంది? ఇంతకు వారెవరు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
పుట్టుట.. గిట్టుట
ప్రతి జీవి పుట్టిన తర్వాత గిట్టడం ఖాయం. అదేనండీ జన్మతో పాటు చావు ఖాయమే. ఇది అన్ని జీవుల కంటే మనిషికి మాత్రం భయానకమే. మృత్యువు అంటే భయపడే మనుషులే అధికం. అందుకే మనిషి ప్రతి నిమిషం మృత్యువుకు భయపడి జీవితం సాగిస్తుంటాడు. కొందరికి మృత్యువు అంటే ఎంత భయమో, దాని చెంతకు చేరిన మనిషి శరీరమన్నా ఇంకా భయం ఎక్కువ. అందుకే చాలా వరకు ఇలాంటి కార్యాలకు కొందరు దూరంగా ఉంటారు. మరికొందరు అవేమీ పట్టింపులు లేకుండా తమ పని తాము కానిచ్చేస్తారు.
భయం.. భయం
ఎవరైనా మృతి చెందిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అలా దహన సంస్కారాలు నిర్వహించిన తర్వాత మళ్లీ ఆ వైపు కన్నెత్తి చూడాలంటే భయం భయం. కొందరు దెయ్యాలు, భూతాలు అంటూ గజగజ వణికి పోతుంటారు. అయితే ప్రస్తుతం ఆధునిక కాలం కావడంతో అలాంటి భయాలు కాస్త తగ్గాయని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఈ భయాలు అలాగే ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ తెగ కాస్త వెరైటీ..
ఇండోనేషియాలో ఉన్న ఓ తెగ కాస్త వెరైటీ అనే చెప్పవచ్చు. వీరు చనిపోయిన మనుషులతో ఎంచక్కా మాట్లాడుతారు. అలాగే వారికి స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు కొట్టిస్తారు. ఇలా చేయడానికి కారణాలు ఏవైనా కానీ, వీరు మాత్రం చనిపోయిన వారిని తమలో ఒకరిగా భావిస్తూ జీవనం సాగిస్తారు. అందుకే ఈ తెగ జీవన శైలి ఓ వెరైటీ అని చెప్పవచ్చు.
ఏడాదికి ఒకసారి స్నానం..
ఇండోనేషియాలో టొరాజా అనే తెగ ఉంది. వీరి జీవనశైలి భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా వీరి కుటుంబీకులు మరణిస్తే వీరు పాటించే సాంప్రదాయాలే వేరు. ఔను మీరు విన్నది నిజమే. ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోతే, వీరు కరెక్ట్ ఏడాదికి సమాధిని త్రవ్వుతారు. అక్కడ శరీర అస్థిపంజరం ఉండడం కామన్. అదే అస్థిపంజరాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. ఆ తర్వాత యోగక్షేమాలు అడుగుతారు. అవతల ఎటువంటి స్పందన లేకపోయినా వారి మాటలు అలాగే కొనసాగిస్తారు. ఆ తర్వాత స్నానం చేయించి, తమ సంప్రదాయ వస్త్రధారణ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ సమాధిలోకి పంపిస్తారు. ఈ సంప్రదాయాన్నే ఇక్కడ మైనేనే అని పిలుస్తారు.
ఇలా ఎందుకంటే?
పుట్టిన ప్రతి జీవి మృత్యువు ఒడికి చేరడం సర్వ సాధారణం. చనిపోయిన వ్యక్తి జ్ఞాపకాలను ప్రతి కుటుంబీకులు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. అయితే టొరాజా తెగ జాతి వారు మాత్రం చనిపోయిన వారు తమ కుటుంబంలో ఒక భాగంగానే పరిగణిస్తారు. తమతో పాటు వారు ఉన్నారన్న భావన వీరిలో మెండు. అందుకే ఏడాదికి ఒకసారి తమ కుటుంబంలో చనిపోయిన వారిని బయటకు తీసి పలకరిస్తారు.
Also Read: Ajith Kumar: ఉదయం వరకు బతకడం అదృష్టమే… సినిమాల నుంచి తప్పుకుంటా.. అజిత్ షాకింగ్ స్టేట్మెంట్..!
ఆ తర్వాత వారి బాగోగులు చూస్తారు. ఎంతైనా ఇదొక వింత ఆచారమే. ఈ ఆచారంతో వీరు ప్రపంచానికి చాటి చెప్పిన నీతి ఏమిటంటే.. మూఢనమ్మకాలను విశ్వసించవద్దు. అలాగే చనిపోయిన వారు మనలో ఒకరే. కాబట్టి ఊపిరి లేని శరీరాన్ని చూసి భయపడడం అంతా ఆవివేకమేనని వీరి మాట. ఇప్పటికైనా మనం మూఢనమ్మకాలను విడనాడుదాం. ఆధునిక కాలానికి అనుగుణంగా నడుచుకుందాం.