E-Paper
Advertisement

భారత ఎన్నికల వ్యవస్థ అమోఘం.. అమెరికా చూసి నేర్చుకోవాలి.. ట్రంప్ ప్రశంసల వర్షం!

భారత ఎన్నికల వ్యవస్థ అమోఘం.. అమెరికా చూసి నేర్చుకోవాలి.. ట్రంప్ ప్రశంసల వర్షం!
Advertisement

SAVE America Act: అమెరికా ఎన్నికల్లో ఓటర్ల గుర్తింపు కార్డు (ఫోటో ఐడీ) తప్పనిసరి చేయాలనే డిమాండ్‌ను మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తెరపైకి తెచ్చారు. అమెరికాలో ఓటింగ్ ప్రక్రియ కోసం ప్రతిపాదించిన ‘సేవ్ అమెరికా యాక్ట్’ (SAVE America Act) ఆమోదానికి మద్దతు కూడగట్టే క్రమంలో ఆయన భారత ఎన్నికల వ్యవస్థను ప్రధాన ఉదాహరణగా ప్రస్తావించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ లో ట్రంప్ చేసిన పోస్ట్.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది.

భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ ప్రశంసలు

తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేసిన ట్రంప్.. ఇటీవల జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల పరిమాణాన్ని, అక్కడి పారదర్శకతను కొనియాడారు. ‘భారత్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొనగా వారిలో ప్రతీ ఒక్కరూ చెల్లుబాటు అయ్యే ఓటర్ గుర్తింపు కార్డును ఉపయోగించారు. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినవారు ఒక శాతం కంటే తక్కువే ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో సరైన ఓటర్ ఐడీ లేకపోవడంపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Advertisement

మాజీ రాయబారి సెర్గియో గోర్ మద్దతు

ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలకు భారత్‌లో అమెరికా రాయబారిగా వ్యవహరించిన సెర్గియో గోర్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. భారత ఎన్నికలను ప్రపంచానికే ఆదర్శంగా ఆయన పేర్కొన్నారు. ‘64.6 కోట్ల మంది ఓటర్లు ప్రతీ ఒక్కరూ ఐడీ చూపి ఓటు వేసేలా అమెరికా కాంగ్రెస్ ‘సేవ్ అమెరికా యాక్ట్’ను ఎందుకు ఆమోదించకూడదు?’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మెుత్తం మీద భారత ఎన్నికల వ్యవస్థను చూపిస్తూ.. ట్రంప్ సర్కార్ సేవ్ అమెరికా యాక్ట్ ను నెగ్గించుకోవాలని చూస్తుండటం విశేషం.

Advertisement

అసలేంటీ ‘సేవ్ అమెరికా యాక్ట్’?

అమెరికా ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు, పౌరసత్వం ఉన్నవారే ఓటు వేసేలా చూసేందుకు రిపబ్లికన్లు ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ప్రకారం.. ఓటరుగా నమోదు చేసుకోవడానికి అమెరికన్ ప్రజలు.. తమ పౌరసత్వ ఆధారాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఓటింగ్ సమయంలో కచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాలి. మరోవైపు అనారోగ్యం, అంగవైకల్యం, మిలటరీ సేవలకు మాత్రమే పోస్టల్ లేదా మెయిల్ ఓటింగ్‌కు ఈ బిల్లు ద్వారా అనుమతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా అమెరికన్ పౌరసత్వం లేకుండా ఇప్పటివరకూ ఓట్లు వేస్తూ వచ్చిన వారి పైర్లను తొలగించేందుకు సైతం ఈ బిల్లులో ప్రతిపాదించారు.

Also Read: ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు కలకలం.. సుప్రీంకోర్టు సంచలన నివేదిక!

వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు అమెరికాలోని ఎన్నికల ప్రక్రియను ఇతర దేశాలతో పోలుస్తూ వైట్‌హౌస్ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్‌తో అనుసంధానించాయని పేర్కొంది. కానీ అమెరికా మాత్రం ఓటర్ల స్వీయ ధ్రువీకరణ (Self-attestation) పైనే ఆధారపడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా పౌరులు మాత్రమే అమెరికా భవిష్యత్తును నిర్ణయించాలని స్పష్టం చేసింది. అయితే ఈ బిల్లుపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో కాంగ్రెస్‌లో చర్చలు కొనసాగుతున్నాయి.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని ఆఫర్.. Oppo Find X9పై ఏకంగా రూ. 22,220 డిస్కౌంట్!

Tags

Related News

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం.. భారత్ ఫార్మా కంపెనీపై డ్రోన్ల దాడి, రూ.400 కోట్ల నష్టం!

తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు, ఇకపై ఇజ్రాయెల్..

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..

‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

ఫ్లైదుబాయ్ దాడి ఘటన.. కో-పైలెట్ వెనుక ఉగ్రకోణం.. వెలుగులోకి సంచలన నిజాలు!

మాపై దాడికి తెగిస్తే అణ్వాయుధాలే.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు వార్నింగ్!

ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!

టిబెట్‌లో చైనా రహస్య తవ్వకాలు.. భారత్‌కు పొంచి ఉన్న అతిపెద్ద పర్యావరణ ముప్పు!

Big Stories

Advertisement
×