Big Stories

International Mothers Day 2024: అనుబంధం.. ఆప్యాయత.. ఆత్మీయత.. కలబోతే అమ్మ..!

International ‘Mothers Day’ Special Story: రెండక్షరాల కమ్మని పదం అమ్మ. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇందుకోసం తన జీవితంలో ఎన్నో త్యాగాలను చేస్తుంది. అలాంటి మాతృమూర్తి సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది మే 2 ఆదివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటున్నాం.. మనల్ని ఎంతగానో ప్రేమించే అమ్మను గౌరవించడం ఒక కొడుకుగా, కూతురిగా మన బాధ్యత. అమ్మ అంటే ఓ అందమైన అనుభూతి.. ఓ అనుబంధం.. ఓ ఆప్యాయత.. ఓ ఆత్మీయత బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలవుతుందన్న సంగతీ కూడా మనకంటే ముందే అమ్మే పసి కడుతుంది. తన బిడ్డ విజయాలను సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలు అవుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి.

- Advertisement -

మనం బయట తిరిగి తిరగి ఇంటికి వెళ్తే గుమ్మంలోనే మన కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తూ ఉంటుంది. అమ్మ గురించి ఎంత వర్ణించిన ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. సృష్టిలో చెడ్డ స్నేహితుడు, చెడ్డ చుట్టం, చెడ్డ అక్క, చెడ్డ అన్న, చెడ్డ తమ్ముడు, చెల్లి.. చివరకు చెడ్డ నాన్నైనా ఉంటారేమే కాని.. చెడ్డ అమ్మ మాత్రం ఉండబోదు. దేవుడు తాను అన్ని చోట్ల ఉండలేక తనకు బదులుగా అమ్మను సృష్టించాడు అన్న నానుడిలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు లేడనే మనిషి ఉంటాడు కాని అమ్మ లేదని మనిషి ఉండడు. బిడ్డ జీవితాంతం వెంట ఉండేది తల్లి ప్రేమ మాత్రమే.. అందుకే ప్రపంచం తల్లికి ఇచ్చిన గైరవం మరేబంధానికి ఇవ్వదు. తల్లి ప్రతిక్షణం ఆ బిడ్డకోసమే పరితపిస్తుంది. పది నెలలు మోసి పాలిచ్చి పెంచి బిడ్డకు ఎన్నో సేవలు చేస్తుంది. ఆశలన్ని ధార పోసి పెంచుకుంటుంది. అమ్మ ప్రేమలో ఎలాంటి స్వార్దం ఉండదు.

- Advertisement -

అహర్నిశలు బిడ్డకోసం కష్టపడుతూ ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసేదే అమ్మ. ఎన్ని కష్టాలు ఎదురైన బిడ్డ సుఖం కోసం చిరునవ్వుతో అధికమిస్తుంది. అమ్మ లాలి పాట, అమ్మ ఒడి వెచ్చదనం.. అమ్మ ఇచ్చే ఓదార్పు కలిగించే సంతోషానికి ప్రపంచంలో మరేవి సాటిరావు. పెదవి పలికే మాటలన్నిటిలోను తీయని మాటే అమ్మే.. తాను కదిలే దేవత అమ్మ.. సూది మందుకు బయపడే అమ్మ నవ మాసాలు మోస్తూ పంటి బిగువున పురిటి నొప్పులు సంతోషంగా బరిస్తుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కాని అమ్మ ప్రేమ ముదు అది దిగదుడుపే. కష్టమొస్తే.. అది శిశువైన, పశువైన తల్లి ఒడికే పరుగులు తీయాలి. అమ్మ అనే పదానికి అంతటి మహత్యం ఉంది. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడినుంచి పుట్టాడు.

Also Read: బాలుడి మృతదేహాన్ని వదిలి.. పేరెంట్స్ ను తీసుకెళ్లిన విమానం

మన పెద్దలు సైతం మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చారు. ప్రపంచంలో ఏ ప్రాతంలోనైనా.. ఏదేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు. కాని అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ మాత్రం బాధ కలిగిన అమ్మనే తలుచుకుంటాం అమ్మ స్థానం అంత గొప్పది. బిడ్డకు మంచి చెడులు, విద్యాబుద్దులు చెప్పడమే కాదు మనకు ఏమాత్రం సుస్తి చేసిన విలవిల్లాడి పోతూ నిమిషానికి ఓసారి బుగ్గల మీద, పొట్ట మీద చేయి పెట్టి చూస్తూ కనిపించని ఆ దేవుళ్లకి మొక్కుతూ ఉండటం చూస్తే అమ్మ కాస్తంత చాదస్తపురాలు అనిపిస్తూ ఉంటుంది.

మనకు ఇష్టమైనవి కొనుక్కోవాలన్న.. వెదవతిరుగుళ్లకు డబ్బులు కావాలన్న మన తరుపున నాన్నతో నానాతిట్లు తిని మన అనసరాలు సరదాలు తీర్చే అమయకురాలు అమ్మ. తన గురించి ఎంతచెప్పిన ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఆమే ప్రేమలా.. ఎప్పుడు మన గురించే ఆలోచన, మన మీదనే ద్యాస అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితులురాలు. మనకందించే ప్రేమలో కాస్త తనకి తిరిగిచ్చినా చాలు.. తన కష్టమంతా మరిచిపోతుంది. అంతకు రెట్టింపు ప్రేమను తిరిగి మనకు అందిస్తుంది. తనతో కాసేపు ప్రేమగా మాట్లాడిన ఆమాటలను తను జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఈ మాతృదినోత్సవం రోజున మన మాతృమూర్తిని సంతోషపెట్టి తనతో కాస్త సమయం గడుపుదాం.. అమ్మా నీకు వందనం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News