BigTV English

IPhone pro units shortage : 20 వేల మంది పరార్.. ఆపిల్‌కు భారీ దెబ్బ..

IPhone pro units shortage : 20 వేల మంది పరార్.. ఆపిల్‌కు భారీ దెబ్బ..

IPhone pro units shortage : చైనా జెంగ్ జౌలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ నుంచి కార్మికులు భారీ సంఖ్యలో వెళ్లిపోతుండటం… ఐఫోన్ల తయారీపై భారీ ప్రభావం చూపనుంది.


తాజాగా 20 వేల మంది కార్మికులు ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ నుంచి వెళ్లిపోయారని… మరోవైపు కొత్త ఉద్యోగులు కూడా ఇంకా పనిలో కుదురుకోలేదని… దాంతో 60 లక్షల ఐఫోన్‌ ప్రో యూనిట్ల కొరత ఏర్పడవచ్చని ఆపిల్ అంచనా వేస్తోంది. అసలు ఉత్పత్తి ఎప్పుడు ఊపందుకుంటుందో తెలీని పరిస్థితి నెలకొనడంతో… తయారీ అంచనాల్లో ఇంకా కోత పడే సూచనలూ కనిపిస్తున్నాయని కంపెనీ వర్గాలు అంటున్నాయి. దాంతో… డిమాండ్ మేరకు ఐఫోన్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు… విశ్లేషకులు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం గిరాకీ అధికంగా ఉన్న ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు అత్యధికంగా జెంగ్ జౌలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లోనే తయారవుతున్నాయి. కానీ, అక్కడ కార్మికుల ఆందోళనతో ఐఫోన్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. కొవిడ్‌ ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన కార్మికులు తిరిగి విధుల్లో చేరే వరకు ఐఫోన్ల తయారీపై అనిశ్చితి ఇలాగే ఉంటుందని ఆపిల్ భావిస్తోంది. లాక్‌డౌన్‌ కొనసాగినన్నాళ్లూ ఈ పరిస్థితి తప్పదన్న నిర్ణయానికి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో తయారీ అంచనాల్ని ఇటీవల 90 మిలియన్‌ యూనిట్ల నుంచి 87 మిలియన్‌ యూనిట్లకు తగ్గించింది. గత రెండు వారాలుగా ఈ అంచనాలను సవరిస్తూ వస్తోంది.


ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ తో పాటు అమెరికాలోనూ క్రిస్మస్‌ సందర్భంగా ఏటా ఈ సమయంలో ఐఫోన్లకు భారీ గిరాకీ ఉంటుంది. కచ్చితంగా డిమాండ్ ఉన్న తరుణంలోనే… తయారీ, సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంపై ఆపిల్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాంతో… తాజాగా ఆపిల్ షేరు 2.6 శాతం కుంగి 144 డాలర్లకు చేరింది. 2020 ఆరంభం నుంచి ఆపిల్ షేరు విలువ 19 శాతం తగ్గింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×