E-Paper
Advertisement

కువైట్-బహ్రెయిన్‌లపై ఇరాన్ భీకరదాడులు.. నరకం చూస్తారంటూ అమెరికాకు హెచ్చరిక

కువైట్-బహ్రెయిన్‌లపై ఇరాన్ భీకరదాడులు.. నరకం చూస్తారంటూ అమెరికాకు హెచ్చరిక
Advertisement

Iran Vs America: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం తీవ్రమయ్యే అవకాశాలున్నాయా? కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా ఎందుకు కాల్పులు జరుగుతున్నాయి? కువైట్-బహ్రెయిన్‌లపై ఇరాన్ భీకర దాడుల వెనుక అసలు ఏం జరిగింది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు నరకం చూస్తారని అన్నారు? ఇరు దేశాల మధ్య సంధికి తిలోదకాలు ఇచ్చేసినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

కువైట్-బహ్రెయిన్‌లపై ఇరాన్ భీకర దాడులు

Advertisement

పశ్చిమాసియాలో యుద్ధ భయాలు మళ్లీ మొదలయ్యాయి. గడిచిన రెండు రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య పరస్పరం దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ క్షిపణి, డ్రోన్‌ నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లక్ష్యంగా అమెరికా దాడి చేసింది. దీనికి ప్రతిగా గల్ప్‌లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది ఇరాన్.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కువైట్‌-బహ్రెయిన్ దేశాల్లోని సైనిక స్థావరాలపై నౌక-వైమానిక దళాలు దాడులు మొదలుపెట్టినట్టు ఐఆర్‌జీసీ ఈ ఉదయం ప్రకటించింది.  బహ్రెయిన్‌లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగాయి. దీంతో సైనిక స్థావరాల చుట్టూ భారీగా అక్కడి బలగాలు మోహరించాయి. అటు కువైట్ కూడా అలర్ట్ అయ్యింది. తన గగన తల రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది.

Advertisement

నరకం చూస్తారంటూ  ఇరాన్ హెచ్చరిక.. ఉనికే ప్రమాదంలో పడిందన్న ట్రంప్

శత్రువుల ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. బహ్రెయిన్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇది ముమ్మాటికీ తప్పుడు చర్యగా వర్ణించింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరం అక్కడే ఉంది. ఇరాన్-అమెరికా సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితి గంట గంటకు ఉద్రిక్తంగా మారుతోంది.

ఈ దాడి తర్వాత అమెరికాకు తీవ్ర హెచ్చరికలు ఇరాన్. రాబోయే రోజుల్లో అమెరికా సైనిక స్థావరాలు నరకాన్ని చూస్తాయని వ్యాఖ్యానించింది. అమెరికా తొలి శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. హోర్మూజ్ జలసంధిలో తమ నిబంధనలను పాటించని నౌకలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టు చేశారు.

ALSO READ: క్షణాల్లో స్మశానంలా మారిన వెనిజులా.. ఈ వీడియోలు చూస్తే హడలిపోతారు!

ఇరాన్ క్షిపణి, డ్రోన్‌ నిల్వ కేంద్రాలపై దాడులు చేసిన విషయాన్ని ట్రూత్ వేదికగా వెల్లడించారు. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో వైమానిక దళం దాడులు చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో విజయవంతంగా ప్రారంభించిన పనిని సైనిక పద్ధతిలో పూర్తి చేయాల్సి రావొచ్చన్నారు. అదే జరిగితే ఇరాన్ ఉనికే ప్రమాదంలో పడిపోతుందని హెచ్చరించే ప్రయత్నం చేశారు.

ఇరుదేశాల మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కీలకమైన హార్మూజ్‌ జలసంధి వద్ద భద్రతా పరిస్థితి దిగజారింది. అక్కడ ప్రయాణించే నౌకలకు ముప్పు పెరగడంతో చమురు మార్కెట్లు ఆందోళన మొదలైంది. రేపటి రోజుల ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని అంటున్నారు.

 

Related News

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? రచ్చలేపిన జర్నలిస్ట్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన పాక్ ఆర్మీ!

ఫ్యామిలీని చంపడం ఎలా? చాట్‌జీపీటీ సమాధానాలు, తల్లి-తమ్ముడ్ని చంపిన భారత సంతతి టీనేజర్

సూర్యగ్రహణానికి, ఆ గ్రామానికి సంబంధం ఏమిటి? అక్కడ ఉండేది 10 మంది మాత్రమే!

విమానం ఎక్కి.. అదృశ్యమైన ట్రంప్.. హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్!

48 గంటల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఆరు భారీ అగ్నిపర్వతాలు యాక్టివేట్, దేనికి సంకేతం?

చిగురుటాకులా వణికిన కొలంబియా.. భారీ భూకంపంతో కకావికలం, 110 మంది మృతి

ఇరాన్ ఇష్యూలో ట్రంప్ వెనక్కి.. అణు ఒప్పందం లేకుండానే పుల్‌స్టాప్‌కు యత్నాలు, దీని వెనుక ఏం జరిగింది?

ఆగష్టు 12న నాలుగు ఖగోళ వింతలు.. ఆరు గ్రహాలు పరేడ్, అమావాస్యతోపాటు సూర్యగ్రహణం

Big Stories

Advertisement
×