E-Paper
Advertisement

48 గంటల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఆరు భారీ అగ్నిపర్వతాలు యాక్టివేట్, దేనికి సంకేతం?

48 గంటల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఆరు భారీ అగ్నిపర్వతాలు యాక్టివేట్, దేనికి సంకేతం?
Advertisement

Several Volcanoes Erupted: ప్రళయం మొదలైందా? ఓ వైపు భూకంపాలు.. ఇంకోవైపు అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ప్రకృతి కన్నెర్ర దేనికి సంకేతం. భూమికి ముప్పు పొంచి వుందా? అంతం కానుందా? ప్రపంచవ్యాప్తంగా గడిచిన 48 గంటల్లో ఆరు భారీ అగ్నిపర్వతాలు యాక్టివేట్ అయ్యాయా? దీని వెనుక అసలు ఏం జరుగుతోంది?

 

ముంచుకొస్తున్న ప్రళయం

Advertisement

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారీ అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. ఒకేసారి అగ్నిపర్వతాలు బద్దలు కావడం దేనికి సంకేతం. ప్రళయం మొదలైందా? వరుస నెలల్లో దక్షిణ అమెరికా ఖండంపై ప్రకృతి కన్నెర్ర చేసింది. అగ్నిపర్వతాలు ఒకే దేశంలో కాదు, వేర్వేరు దేశాల్లో బద్దలయ్యాయి. 48 గంటల వ్యవధిలో మెక్సికో, కొలంబియా, ఇటలీ, జపాన్, గ్వాటెమాల, ఇండోనేషియా వంటి దీవుల్లో బద్దలయ్యాయి.

తక్కువ వ్యవధిలో ఆరు దేశాల నుండి అన్ని అగ్నిపర్వతాలు ఎందుకు క్రియాశీలమవుతున్నాయని ప్రజల్లో ఆలోచన మొదలైంది. ఈ సంఘటనలను అన్నింటితో ముడిపెట్టడం సరికాదంటున్నారు నిపుణులు. ప్రతి అగ్నిపర్వతం ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయని చెబుతున్నారు. భూమి లోపల వేడి ద్రవ శిలలు కదలికల వల్ల అగ్ని పర్వతాలు క్రియాశీలమవుతాయని చెబుతున్నారు.

Advertisement

 

48 గంటల్లో ఆరు భారీ అగ్నిపర్వతాలు యాక్టివేట్

మెక్సికోలో పోపోకాటెపెట్ల్ వంటి అగ్ని పర్వతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు శాస్తవేత్తలు. కాలానుగుణంగా లావా బయటకు రావడం, బూడిద వెదజల్లుతుంటాయని అంటున్నారు. ఇటలీలోని ఎట్నా-స్ట్రోంబోలి కూడా క్రియాశీలక అగ్నిపర్వతాలే. ఇటీవల కాలంలో ఎట్నా వద్ద కార్యకలాపాలు పెరిగాయని చెబుతున్నారు. అలాగే స్ట్రోంబోలి వద్ద లావా ప్రవాహాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

గ్వాటెమాలలోని ఫ్యూగో అగ్నిపర్వతం ఇటీవల బూడిద-లావాలను వెదజల్లుతూ చురుకుగా ఉంటోంది. ఫ్యూగో అగ్నిపర్వతం.. అమెరికాకు దగ్గర, అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి. దీని కార్యకలాపాలను స్థానిక సంస్థలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయి. కొలంబియాలో అనేక క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. అగ్నిపర్వత కార్యకలాపాలు పెరుగుతున్నాయో? లేదా తగ్గుతున్నాయో? నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు వాటి నుంచి వెలువడే వాయువు, బూడిద, భూ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.

ఇక తూర్పు తీరం జపాన్‌ విషయానికి వద్దాం. సకురాజిమా తరచుగా క్రియాశీలంగా ఉంటుంది. ఇండోనేషియాలోని అనేక అగ్నిపర్వతాలు కాలానుగుణంగా లావాను వెదజల్లుతాయి. స్మిత్సోనియన్ గ్లోబల్ వోల్కానిజం ప్రోగ్రామ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏ సమయంలోనైనా 40- 50 అగ్నిపర్వతాలు క్రియాశీలంగా ఉండవచ్చని చెబుతున్నాయి.

ALSO READ: చిగురుటాకులా వణికిన కొలంబియా.. భారీ భూకంపంతో కకావికలం, 110 మంది మృతి

వివిధ ఖండాల్లోని ఆరు దేశాల్లో అగ్నిపర్వతాలు ఒక్కసారిగా యాక్టివేట్ కావడం పెద్ద వార్త. దానివల్ల అగ్నిపర్వత విస్ఫోటనం తక్షణం జరుగుతుందని అర్థం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్నిపర్వతాలు క్రియాశీలంగా ఉన్నాయి. స్మిత్సోనియన్ డేటా ప్రకారం.. 2025 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 63 అగ్నిపర్వతాల వద్ద 71 విస్ఫోటనాలు నమోదైన విషయం తెల్సిందే. బూడిద, లావా పరిమాణం, భూగర్భ కదలికలను శాస్తవేత్తలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.

Related News

చిగురుటాకులా వణికిన కొలంబియా.. భారీ భూకంపంతో కకావికలం, 110 మంది మృతి

ఇరాన్ ఇష్యూలో ట్రంప్ వెనక్కి.. అణు ఒప్పందం లేకుండానే పుల్‌స్టాప్‌కు యత్నాలు, దీని వెనుక ఏం జరిగింది?

ఆగష్టు 12న నాలుగు ఖగోళ వింతలు.. ఆరు గ్రహాలు పరేడ్, అమావాస్యతోపాటు సూర్యగ్రహణం

రష్యా టు ఇండియా.. రైలు కనెక్టివిటీపై మాస్కో ప్రతిపాదన, అసలు కారణం అదే

అడవిలో కూలిన హెలికాప్టర్.. నలుగురి దుర్మరణం, ముగ్గురు టూరిస్టులు

మొజ్తబా ఖమేనీ బయటకు వచ్చారు.. ఇదిగో కొత్త వీడియో.. కొంతమందితో మాట్లాడుతూ

ట్రంప్ ప్రభుత్వం కొత్త పాలసీ.. టార్గెట్ H-1B వీసాదారులు, 60 రోజులు ఎత్తేసే అవకాశం

Big Stories

Advertisement
×