E-Paper
Advertisement

ఇరాన్ ఇష్యూలో ట్రంప్ వెనక్కి.. అణు ఒప్పందం లేకుండానే పుల్‌స్టాప్‌కు యత్నాలు, దీని వెనుక ఏం జరిగింది?

ఇరాన్ ఇష్యూలో ట్రంప్ వెనక్కి.. అణు ఒప్పందం లేకుండానే పుల్‌స్టాప్‌కు యత్నాలు, దీని వెనుక ఏం జరిగింది?
Advertisement

Trump: ఇరాన్ యుద్ధం వ్యవహారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టిందా? అక్కడ లాభం కంటే తన సీటుకు ఎసరు తెచ్చే పరిస్థితి నెలకొందా? జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ ఇష్యూ నుంచి బయట పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా? అంతర్జాతీయ మీడియలో కథనాల వెనుక అసలు ఏం జరిగింది?

 

ఇరాన్ ఇష్యూలో ట్రంప్ వెనక్కి

Advertisement

ఇరాన్ విషయంలో అమెరికా వైఖరి మారినట్టు కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌ ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్‌ జలసంధిని ఓపెన్ చేస్తే.. ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందామని ట్రంప్‌ తన సన్నిహిత వర్గాలకు చెప్పినట్లు అందులోని సారాంశం. తొలుత అణ్వాయుధాలను నాశనం చేస్తామని పదే పదే చెప్పిన ట్రంప్, అణు డీల్‌ లేకుండానే యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారట. దీంతో ట్రంప్ వెనక్కి అడుగు వేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ పట్టు బిగిస్తోంది.

 

అణు డీల్‌ లేకుండానే పుల్‌స్టాప్‌కు యత్నాలు

Advertisement

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు ఫలించలేదు. పశ్చిమాసియాలో ఘర్షణలు కొనసాగించేందుకు టెహ్రాన్‌ రెడీగా ఉందని సంకేతాలు వెలువడ్డాయి. జరుగుతున్న పరిణామాలు ట్రంప్‌ను కలవర పెడుతున్నట్లు కనిపిస్తోంది. హర్మూజ్‌ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్‌ తన డిమాండ్లను ఇప్పుటికే చెప్పింది. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తి వేయడం, ఈ ప్రాంతం నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోవాలని డిమాండ్‌ చేసింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగిసే వరకు హర్మూజ్‌ను ఓపెన్ చేయమని తేల్చి చెప్పడం ట్రంప్ కు మింగుడుపడడం లేదు.

అమెరికా వెనకడుగు వేయడం వెనుక

ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మధ్యంతర ఎన్నికల సంకేతాలు ట్రంప్‌ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉండడంతో స్వదేశంలో వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధం నుంచి సేఫ్‌గా బయటపడేందుకు కొత్త మార్గాలు అన్వేషన చేస్తోందనట్లు అక్కడి పత్రికలు ప్రస్తావించాయి. ఇక బహిరంగంగా ట్రంప్.. ఇరాన్ కాళ్ల బేరానికి వస్తోందని బయటకు చెబుతున్న విషయం తెల్సిందే.

Related News

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

Big Stories

Advertisement
×