Trump Secret Flight: ఇరాన్ హత్యాయత్నానికి కుట్ర పన్నిందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భద్రత కోసం రహస్య ఆపరేషన్ నిర్వహించారు. పటిష్ట భద్రతకు నెలవైన ఎయిర్‌ఫోర్స్ వన్‌ను వదిలి.. ట్రంప్ యూఎస్ మిలిటరీకి చెందిన చిన్న విమానంలో ప్రయాణించినట్లు అమెరికన్ మీడియా పేర్కొంది. ఇటీవల తుర్కియేలో జరిగిన నాటో సదస్సు అనంతరం తిరిగి అమెరికాకు వచ్చే క్రమంలో ట్రంప్ సీక్రెట్ ఫ్లైట్ ను ఉపయోగించినట్లు పేర్కొంది.
‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రకారం.. మీడియాతో పాటు తన వెంట ఉన్న కొందరు వైట్ హౌస్ సిబ్బందిని కూడా బురిడీ కొట్టిస్తూ ట్రంప్‌ను ఒక రహస్య విమానంలో తరలించారు. జూలై 8న నాటో సమ్మిట్ ముగిసిన తర్వాత, ట్రంప్ ఎప్పటిలాగే మీడియా కెమెరాల కంటపడేలా ‘ఎయిర్ ఫోర్స్ వన్’ జంబో జెట్ ఎక్కారు. అయితే విమానం లోపలికి వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే అసలు ఆపరేషన్ మొదలైంది. విమానానికి ఆహార పదార్థాలు, ఇతర సరుకులు సరఫరా చేసే కేటరింగ్ ట్రక్కును విమానం వెనుక వైపు ఉన్న తలుపు వద్దకు తీసుకొచ్చారు. అందులో ట్రంప్ తో పాటు ఆయన ముఖ్య భద్రతాసిబ్బంది ఎక్కారు.
అక్కడ నుంచి ఆయనను రహస్యంగా ‘ఎయిర్ ఫోర్స్ C-32A’ అనే చిన్న విమానంలోకి మార్చినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. అయితే సమాచారం బయటకు పొక్కకుండా ఉండేందుకు ట్రంప్ తో పాటు వచ్చిన మిగిలిన వైట్ హౌస్ సిబ్బందిని, విలేకరులను పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే ఉంచారు. వారితోనే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం అమెరికాకు బయటలు దేరింది. అంటే విలేకరులు ప్రయాణిస్తున్న విమానం కేవలం శత్రువుల దృష్టిని మళ్లించడానికి ఉపయోగించిన ‘డెకాయ్’ (నకిలీ లక్ష్యం) గా మారిపోయిందని అమెరికన్ మీడియా పేర్కొంది.
అయితే ఈ రహస్య ఆపరేషన్ ను ముందే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా అధ్యక్షుడి పర్యటన కోసం పాత ఎయిర్ ఫోర్స్ వన్‌తో పాటు ఖతార్ బహుమతిగా ఇచ్చిన జెట్, బోయింగ్ 757 రకానికి చెందిన ఈ ‘C-32A’ విమానాన్ని టర్కీకి తీసుకెళ్లారు. ఈ సీక్రెట్ జర్నీలో భాగంగా.. వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ కూడా ఎవరికి అనుమానం రాకుండా రహస్యంగా C-32A విమానంలోకి ఎక్కినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అంతేకాకుండా విమానం ల్యాండ్ అయిన తర్వాత తిరిగి ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి వచ్చి.. దాని నుంచే అమెరికా గడ్డపై అడ్డుగుపెట్టారని తెలిపింది. అయితే ఆయన అందులోకి ఎలా వచ్చారన్న విషయాన్ని దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
Also Read: సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ డీల్!
కాగా, సీక్రెట్ ఆపరేషన్ పై వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుయాంగ్ స్పందించారు. ‘అధ్యక్షుడికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శత్రువులు ఉన్నారు. ఆయన భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని, సాంకేతికతను, భద్రతా ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తున్నాం’ అని తెలిపారు. అయితే ఈ తరహా ఆపరేషన్ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి కాదని ఆయన పేర్కొన్నారు. శత్రువుల ముప్పు ఎక్కువగా ఉన్నప్పుడు గతంలోనూ ఇలా అమెరికా అధ్యక్షులను తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు.
Also Read: డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?