Front load washing machine: ఈ రోజుల్లో ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉండటం లగ్జరీ కాదు, ఒక అవసరం. ముఖ్యంగా 4 నుంచి 6 గురు ఉండే పెద్ద ఫ్యామిలీస్‌కు 9 KG కెపాసిటీ ఉన్న మెషీన్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పైగా టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ బట్టలను చాలా నీట్‌గా ఉతుకుతాయి, కరెంట్, వాటర్ కూడా సేవ్ చేస్తాయి. మరి రూ.40వేల బడ్జెట్ లోపు హోమ్ యూజ్ కోసం మార్కెట్లోకి వచ్చిన టాప్ 3 లేటెస్ట్ 9 KG ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ ఏంటో, వాటి స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం.
యూజర్లు కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా ఏఐ టెక్నాలజీ, ఎనర్జీ సేవింగ్ రేటింగ్స్ ఉన్న హోమ్ అప్లయన్సెస్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, బెస్ట్ రివ్యూస్ , అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్న 3 బెస్ట్ ఆప్షన్స్ మీకోసం..
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లలో ఎల్‌జీ (LG) ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఈ లేటెస్ట్ మోడల్‌లో AI DD (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్ డ్రైవ్) టెక్నాలజీని ఇచ్చారు. ఇది బట్టల బరువును మాత్రమే కాకుండా.. ఫ్యాబ్రిక్ రకాన్ని కూడా గుర్తిస్తుంది. దానికి తగినట్లుగా డ్రమ్ మూవ్‌మెంట్స్‌ను అడ్జస్ట్ చేసి బట్టలు పాడవకుండా క్లీన్ చేస్తుంది.
స్మార్ట్ ఫీచర్స్: ఇది 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. కరెంట్ బిల్లు చాలా తక్కువ. ఇందులో ఉన్న 6 మోషన్ డిడి టెక్నాలజీ బట్టలను చేత్తో ఉతికినట్లు క్లీన్ చేస్తుంది. థింక్‌క్యూ (ThinQ) వైఫై కనెక్టివిటీ ద్వారా ఫోన్ నుంచే ఆపరేట్ చేయవచ్చు.
ప్లస్ పాయింట్: మోటార్‌పై డైరెక్ట్ డ్రైవ్ ఉండటం వల్ల శబ్దం, వైబ్రేషన్ అస్సలు ఉండవు.
ఇండియన్ వాటర్ కండిషన్స్ (హార్డ్ వాటర్)కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే బ్రాండ్ ఐఎఫ్‌బీ (IFB). ఈ లేటెస్ట్ 9 KG మోడల్‌లో ‘ఆక్వా ఎనర్జీ’ టెక్నాలజీ ఉంది. ఇది హార్డ్ వాటర్‌ను సాఫ్ట్ వాటర్‌గా మార్చి, డిటర్జెంట్ బట్టల్లో బాగా కరిగేలా చేస్తుంది.
స్మార్ట్ ఫీచర్స్: ఇందులో 3D వాష్ సిస్టమ్ ఉంది. అంటే నీరు మూడు వైపుల నుండి స్ప్రే అవుతుంది. దీని వల్ల బట్టల మూలమూలలా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా.. ‘స్టీమ్ వాష్’ ఫీచర్ వల్ల 99.9% అలర్జీలు, బ్యాక్టీరియా నశిస్తాయి.
ప్లస్ పాయింట్: ఐఎఫ్‌బీ ఇచ్చే 4 సంవత్సరాల కంప్లీట్ వారంటీ , 10 సంవత్సరాల స్పేర్ పార్ట్స్ సపోర్ట్ దీనికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
Also Read: రూ.549 కే సోనీ బ్రాండ్ హెడ్‌ఫోన్స్! ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు బాస్
టెక్నాలజీలో ఎప్పుడూ ముందే ఉండే శామ్‌సంగ్, ఇందులో AI కంట్రోల్, ఎకోబబుల్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఇది తక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో కూడా డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి బట్టల్లోకి త్వరగా వెళ్లేలా చేస్తుంది. దీనివల్ల మొండి మరకలు కూడా ఈజీగా వదిలిపోతాయి.
స్మార్ట్ ఫీచర్స్: దీని డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ చాలా సైలెంట్‌గా పనిచేస్తుంది. దీనికి ఏకంగా 20 ఏళ్ల వారంటీని ఇస్తోంది శామ్‌సంగ్. స్మార్ట్‌థింగ్స్ యాప్ ద్వారా మీ వాషింగ్ పాటర్న్స్‌ను ఇది ట్రాక్ చేస్తుంది. హైజీన్ స్టీమ్ ఫీచర్ బట్టలను డీప్ క్లీన్ చేస్తుంది.
ప్లస్ పాయింట్: దీని లుక్ అండ్ డిజైన్ చాలా ప్రీమియంగా, మోడ్రన్‌గా ఉంటుంది.
రూ.40వేల బడ్జెట్ అనేది 9 కేజీ ఫ్రంట్ లోడ్ మెషీన్ కొనడానికి చాలా మంచి బడ్జెట్. మీరు లాంగ్ టర్మ్ వారంటీ , బెస్ట్ సర్వీస్ కోరుకుంటే IFB వైపు వెళ్ళవచ్చు. సూపర్ ఏఐ ఫీచర్స్ , నో-నాయిస్ పర్ఫార్మెన్స్ కావాలంటే.. LG బెస్ట్ ఛాయిస్. ఇక లేటెస్ట్ టెక్నాలజీ, బ్యూటిఫుల్ డిజైన్ కావాలనుకుంటే.. Samsung పర్ఫెక్ట్. ప్రస్తుతం ఈ మూడు మోడల్స్ అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ లలో మంచి డిస్కౌంట్స్ , నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. మీ ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టుగా బెస్ట్ వన్ ఎంచుకోండి.