E-Paper
Advertisement

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? రచ్చలేపిన జర్నలిస్ట్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన పాక్ ఆర్మీ!

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? రచ్చలేపిన జర్నలిస్ట్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన పాక్ ఆర్మీ!
Advertisement

Imran Khan Death Rumours: జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మెుదలైంది. పాక్ కు చెందిన ఓ జర్నలిస్టు యూట్యూబ్ వేదికగా చేసిన ఈ ప్రకటన.. తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తలు నిరసనలకు దిగారు. పరిస్థితి కాస్త చేయి దాటుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు పాక్ భద్రతాబలగాలు దీనిపై స్పందించాయి. ఇమ్రాన్ ప్రాణాలతోనే ఉన్నట్లు పాక్ ఆర్మీ మీడియా విభాగం ‘ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్’ (ISPR) స్పష్టం చేసింది.

వదంతులు ఎలా మొదలయ్యాయి?

అమెరికాకు చెందిన పాకిస్థానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్.. జైలులోని ఇమ్రాన్ ఖాన్ గురించి యూట్యూబ్ లో బ్యాక్ టూ బ్యాక్ రెండు వీడియోలు పోస్ట్ చేశారు. ‘ఈజ్ ఖాన్ స్టిల్ విత్ అస్? (ఖాన్ మన మధ్యే ఉన్నారా?), ‘వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఖాన్’ అనే రెండు భాగాల వీడియోల ఆధారంగా ఈ వివాదం మొదలైంది. పాక్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులతో జరిపిన సంభాషణల తర్వాత.. ఖాన్ జైలులో జీవించి లేరేమోనన్న అనుమానాలను వజాహత్ వ్యక్తం చేశారు. ఇది కాస్త అంతర్జాతీయంగా కాకరేపడంతో పీటీఐ శ్రేణులు తీవ్ర నిరసనలకు దిగాయి.

బ్రతికుంటే ఆధారాలు ఇవ్వండి!

Advertisement

ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న ప్రచారం జోరందుకోవడంతో.. జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా మళ్లీ స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు తమ వద్ద రాతపూర్వక ఆధారాలు లేవని అత్యంత రహస్యంగా జరుగుతున్న నిర్బంధం కారణంగా సైనిక వర్గాల్లోనే తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అసలు ఖాన్ జీవించి ఉన్నారో లేదో తెలిపేలా ఏదైనా ఆధారాలను విడుదల చేయాలన్నదే తన ఉద్దేశమని ఆయన చెప్పుకొచ్చారు.

పుకార్లపై సైన్యం రియాక్షన్

ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనల నేపథ్యంలో పాక్ సైన్యం అప్రమత్తమైంది. ISPR అధికారికంగా స్పందిస్తూ.. ఈ వార్తలన్నీ కల్పితాలని, దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ప్రకటించింది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీతో పాటు బంధువులకు అడియాలా జైలుకు వచ్చేందుకు అధికారులు అనుమతిచ్చారు. జైలు గదిలో ఇమ్రాన్ క్షేమంగా ఉండటాన్ని, ఆయన నడుస్తున్న దృశ్యాలను వారు వీక్షించినట్లు ISPR వెల్లడించింది. దీంతో ఆయన మరణ వార్తలకు చెక్ పడినప్పటికీ.. ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు మాత్రం తగ్గలేదు.

ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనలు

Advertisement

ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్‌ను చీకటి గదిలో ఏకాంతంగా బంధించడం పట్ల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాన్ తీవ్రమైన రక్తపోటు (BP) సమస్యలతో బాధపడుతున్నారని ఒక కంటి చూపు గణనీయంగా మందగించిందని వారు తెలిపారు. కోర్టు నియమించిన అమిసస్ క్యూరీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించడంతో.. వైద్య అవసరాల దృష్ట్యా శిక్షలను నిలిపివేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. అటు ఐక్యరాజ్యసమితి స్పెషల్ రిపోర్టర్ సైతం ఇమ్రాన్ ఖాన్ ను నిర్బంధించిన తీరును తప్పుబట్టారు. మరోవైపు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం ఆయనకు స్వతంత్ర వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేసింది.

Also Read: ట్రక్కుల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? ఆ ‘OK’ వెనుక పెద్ద చరిత్రే ఉంది!

పీటీఐ ఆగ్రహం – నిరసనల హెచ్చరిక

ఇమ్రాన్ ఖాన్ క్షేమ సమాచారాన్ని దాచిపెడుతూ పాక్ ప్రభుత్వం, సైన్యం ఆటలాడుతున్నాయని పీటీఐ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెక్రటరీ షేఖ్ వకాస్ అక్రమ్ మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై రోజుకో ప్రచారం సాగుతుండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ సొంత వైద్య బృందం, లాయర్లను రావల్పిండి జైలులోకి వెంటనే అనుమతించాలని పట్టుబట్టారు. లేదంటే మిలియన్ల సంఖ్యలో ఆయన మద్దతుదారులు రావల్పిండి వైపు కదం తొక్కుతారని హెచ్చరించారు. కాగా, తోషా ఖానా (జాతీయ ఖజానా) కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను 2023 ఆగస్టు 5న అరెస్టు చేశారు. అప్పటి నుంచి 1100 రోజులకు పైగా ఆయన రావల్పిండిలోని అడియాలా జైలులోనే శిక్ష అనుభవిస్తూ వస్తున్నారు.

Also Read: ప్రీపెయిడ్ vs పోస్ట్‌పెయిడ్.. రెండింట్లో ఏది బెస్ట్.. దేనివల్ల డబ్బులు మిగులుతాయి!

Tags

Related News

ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ప్రభుత్వాలకు సెన్సార్ షాక్, అసలు మేటరేంటి?

మిచిగాన్‌లో వరుస హత్యలు.. ఆరుగురు మృతి, వారిలో నిందితుడు కూడా, ఏం జరిగింది?

ఆగస్టు 15న భారత్‌కే కాకుండా.. ప్రపంచంలో ఇంకా ఏయే దేశాలకు స్వాతంత్ర్యం వచ్చింది?

ట్రంప్ సంచలన ప్రకటన.. హోర్మూజ్‌పై అమెరికా జెండా ఎగురేస్తాం

తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.7 గా నమోదు, సునామీ హెచ్చరిక జారీ

స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!

ఇరాన్‌ను బుజ్జగిస్తున్న యూఏఈ.. 3 బిలియన్ డాలర్ల నగదు, 2 టన్నుల బంగారం, 15 విమానాలు బదిలీ?

Big Stories

Advertisement
×