E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్న మధ్యలోకి వచ్చిన గీత    

Karthika Deepam 2 Serial Today Episode August 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్న మధ్యలోకి వచ్చిన గీత    
Advertisement

Karthika Deepam 2 serial today Episode: రెస్టారెంట్‌ వర్కర్స్‌తో మాలిని తన కండీషన్స్‌ చెప్పగానే.. దీప కూడా తమ కండీషన్స్‌ చెప్పమని జ్యోత్స్నకు చెప్తుంది. జ్యోత్స్న తమ కండీషన్స్‌ చెప్పగానే.. దీప హ్యాపీగా ఫీలవుతుంది. జ్యోత్స్న చెప్పడం కంప్లీట్‌ అయ్యాక సూరజ్‌ చెప్పింది మొత్తం విన్నారు కదా.. మీ భవిష్యత్తు కోసం మీరే మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పగానే.. వర్కర్స్‌ ఆలోచించుకుని రెస్టారెంట్‌ మాలిని గారికే ఇవ్వమని చెప్తారు. దీంతో అందరూ షాక్‌ అవుతారు.

గౌరి ప్రసాద్‌ షాకింగ్ గా  ఏంటి డీఎం రెస్టారెంట్‌కా అని అడగ్గానే.. కాదు.. జ్యోత్స్న రెస్టారెంట్‌కు అని చెప్తారు. మంచి సంస్థతో బాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్తారు. గౌరి ప్రసాద్‌  వర్కర్స్‌ను పంపించి మంచి రోజు చూసుకుని వచ్చి రెస్టారెంట్‌ తీసుకోమని చెప్తాడు. బయటకు వెళ్లిన జ్యోత్స్న సంతోషంగా శివనారాయణకు రెస్టారెంట్‌ మనదే అంటూ చెప్తుంది. మొత్తం జ్యోత్స్న టాలెంట్‌ అంటూ అందరూ చెప్పగానే.. వీళ్ల సపోర్ట్‌ వల్లే ఇదంతా సాధ్యం అయిందని జ్యోత్స్న చెప్తుంది. శివనారాయణ వెటకారంగా దక్షిణమూర్తిని అవమానించి ఇక్కడి  నుంచి బయలుదేరండి.. ఇక ఇది మా రెస్టారెంట్‌ అంటాడు. దక్షిణమూర్తి, మాలిని వెల్లిపోతారు.

Advertisement

తర్వాత ఆఫీసులో కూర్చుని వర్క్‌ చేసుకుంటున్న సూరజ్ ను జ్యోత్స్న చూస్తుంది. సూరజ్‌ మాత్రం ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంటాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి తనను తాను న్యూ ఎంప్లాయిగా పరిచయం చేసుకుంటుంది. తన పేరు గీత అంటూ చెప్పి కంపెనీ గురించి పూర్తి వివరాలు మీ దగ్గర తెలుసుకోమని సీఈవో గారు చెప్పారు.. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెబితే.. వచ్చి తెలుసుకుంటాను అని అడుగుతుంది. పర్వాలేదులే నీ డెస్క్‌ దగ్గరకు నేనే వస్తాను అంటాడు. దీంతో గీత మీరు చాలా మంచి వారు అంటూ మెచ్చుకోగానే.. సూరజ్‌ మీరు నాకు నచ్చారు మనం ఫ్రీ అవ్వగానే కలుద్దామని చెప్తాడు.. అంతా గమనిస్తున్న జ్యోత్స్న కోపంగా నానిని కాఫీ ఇవ్వమని అడుగుతుంది. గట్టిగా అరుస్తుంది. గీత వెళ్లిపోయాక కొత్త వాళ్లను భయపెట్టకూడదని ఇక్కడ బోర్డు పెట్టాలి అంటాడు. దీప, కార్తీక్‌ ఇంకా ఆఫీసుకు రాలేదని జ్యోత్స్న చూస్తుంది.

ఇంట్లో సుమిత్రతో కార్తీక్ తాను తన భార్య కలిసి సూరజ్‌తో జ్యోత్స్న పెళ్లి చేస్తామని మాట ఇస్తాడు. అది జరిగే పనేనా..? అంటూ పారిజాతం అడగ్గానే.. జరిగే పనే ఎందుకంటే జ్యోత్స్న మనసులో సూరజ్‌ ఉన్నాడు అని దీప చెప్తుంది. అలా అని జ్యోత్స్న చెప్పిందా నీకు అని పారిజాతం అడిగితే.. కొన్ని చూస్తే అర్థం అవుతాయి.. చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది దీప. వాళ్లిద్దరికి ఉన్న మనస్తత్వాలు గురించి చెప్తూ.. జ్యోత్స్న ఎందుకు అలా చేసిందో ఇప్పుడు ఎలా మారిపోయిందో దీప చెప్తుంది. సూరజ్ తో పోట్లాడుతూనే తన ఇష్టం పెంచుకుంది. ఆ ఇష్టం దూరం కాకూడదనే పోరాటం చేస్తుంది.. అనగానే.. శివనారాయణ మీరు చెప్తున్నదానికి జ్యోత్స్న ప్రవర్తనకు సంబంధం లేదు. తనేదో పూర్తి వైరాగ్యంలో ఉన్నట్టుంది.  ఈ ప్రేమలు, పెళ్లిల్లు తనకేమీ వద్దంటుంది అనగానే.. ఇవన్నీ పోరాటంలో భాగమే తాతయ్య గారు అంటూ దీప చెప్తుంది. తన మనసులో మాట ఈ విధంగా తెలియజేస్తుది. జ్యోత్స్న గురించి ఎక్కువగా ఆలోచించకు తాత అంటూ కార్తీక్‌ చెప్తాడు.

Advertisement

తర్వాత మాలిని, పారిజాతాన్ని పిలుస్తుంది. ఎందుకు పిలిచావని పారిజాతం అడిగితే.. జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడటానికి అని చెప్తుంది. పారిజాతం అబ్బాయిని చూశామని చెబితే.. శ్రీధర్‌ లా రెండు పెళ్లిల్లు చేసుకున్నాడా..? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. పారిజాతం నుంచి అన్ని విషయాలు రాబడుతుంది మాలిని. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Big Stories

Advertisement
×