E-Paper
Advertisement

ఫ్యామిలీని చంపడం ఎలా? చాట్‌జీపీటీ సమాధానాలు, తల్లి-తమ్ముడ్ని చంపిన భారత సంతతి టీనేజర్

ఫ్యామిలీని చంపడం ఎలా? చాట్‌జీపీటీ సమాధానాలు, తల్లి-తమ్ముడ్ని చంపిన భారత సంతతి టీనేజర్
Advertisement

America: అర చేతిలోకి టెక్నాలజీ వచ్చిన తర్వాత మంచి కంటే చెడుకు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు కొంతమంది యువతీ యువకులు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. తాజాగా అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ టీనేజర్.. తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య ఎలా చేయాలనే దాన్ని ఐఏ ద్వారా తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?

 

అమెరికాలో దారుణం

Advertisement

అమెరికాలోని మసాచుసెట్స్ లోని యాక్టన్ సిటీలో నివాసం ఉంటోంది భారతీయ సంతతికి చెందిన ఓ ఫ్యామిలీ. తల్లి వెంకటేశన్, కొడుకులు అర్జున్, సిద్ధార్థ్ ఫ్యామిలీ ఉంటోంది. హైస్కూల్ చదువుతున్న పెద్ద కొడుకు అర్జున్ వయస్సు 17 ఏళ్లు. మరి ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలీదు. మంగళవారం సాయంత్రం జంట హత్యలు జరిగాయి. ఇంట్లో ట్యూషన్ చెప్పేందుకు వచ్చిన ఓ టీచర్.. ఎంతకీ తలుపు ఓపెన్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో సదరు టీచర్.. అర్జున్ తండ్రికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఎవరూ స్పందించకపోవడంతో కంగారుపడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు.

 

తల్లి-తమ్ముడ్ని చంపిన భారత సంతతి టీనేజర్

Advertisement

పని నిమిత్తం బయటకు వచ్చానని, ఇంటి బయట టీచర్ ఎదురుచూస్తున్నారని, ఇంట్లో కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారో చెప్పాలని పేర్కొన్నారు. పోలీసులు ఇంటికి వచ్చి తలుపు ఓపెన్ చేసేసరికి సుధా వెంకటేశన్ మృతదేహం బేస్‌మెంట్‌లో కనిపించింది. చిన్న కొడుకు సిద్ధార్థ్ మృతదేహం మొదటి అంతస్తులో రక్తపు మడుగులో ఉంది. ఇద్దరు శరీరాలపై తీవ్రమైన గాయాలున్నట్లు గుర్తించారు. ఘటన జరిగిన నుంచి పెద్ద కొడుకు అర్జున్, తల్లి కారు కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు అర్జున్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో బుధవారం వేలాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వాడ్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఫ్యామిలీని చంపడం ఎలా? చాట్‌జీపీటీ సమాధానాలు

కుటుంబాన్ని చంపడానికి సంబంధించిన ఆలోచనల కోసం ఇంటర్నెట్‌తోపాటు చాట్‌ జీపీటీని ఉపయోగించినట్లు తేలింది. గోతిక్ నవల తరహా కథలను సృష్టించేందుకు సాయం చేయాలని ఏఐ చాట్‌బాట్‌ను అడిగినట్లు గుర్తించారు. నిందితుడిపై రెండు హత్య కేసులు, వాహనం దొంగతనం సహా పలు అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. అర్జున్ మాటలు బట్టి కొన్నాళ్లుగా అతడి ప్రవర్తన ఆందోళనకరంగా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. బుధవారం జువెనైల్ కోర్టులో అర్జున్‌ను హాజరుపరచాలని భావించారు. హత్య అభియోగంపై జువెనైల్ కోర్టుకు అధికార పరిధి లేనందున నిందితుడ్ని డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ కోసం హాజరుపర్చనున్నారు పోలీసులు.

ALSO READ: సూర్యగ్రహణానికి-ఆ గ్రామానికి మధ్య సంబంధం ఏంటి?

 

Related News

ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?

వరద గుప్పిట్లో బ్యాంకాక్ సిటీ.. 48 గంటల్లో 300 మి.మీ. వర్షం, విమానాల గురించి..

రాతి యుగానికి చెందిన ప్రజలు.. చెట్లపై వారి జీవితం, భూమికి 20 మీటర్లు ఎత్తులో, ఎక్కడో తెలుసా?

నేపాల్‌కు పొంచివున్న ముప్పు.. హిమాల్ శిఖరంపై భారీ హిమపాతం, 10 మంది మిస్సింగ్

లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

ఐరాస వేదికగా పాక్ పరువు తీసిన జైశంకర్.. ఆ దేశ విలేకరి ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!

Big Stories

Advertisement
×