E-Paper
Advertisement

Iran Crude Oil Supply : 3ఏళ్ల తరువాత భారత్‌కు మళ్లీ క్రూడ్ ఆయిల్ సప్లై చేయనున్న ఇరాన్..

Iran Crude Oil Supply : 3ఏళ్ల తరువాత భారత్‌కు మళ్లీ క్రూడ్ ఆయిల్ సప్లై చేయనున్న ఇరాన్..
Advertisement

Iran Crude Oil Supply : భారత్‌కు 2019 వరకు ముడిచమురును అందించిన ఇరాన్ ఆ తరువాత అమెరికా ఆంక్షలతో నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు ముడిచమురును సరఫరా చేయడానికి సిద్ధమైంది ఇరాన్. ఈ విషయాన్ని భారత్‌లో ఉన్న ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహి తెలిపారు. ఇరాన్‌లో ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. ఇటీవల అక్టోబర్ 26న షిరాజ్‌లోని షియా ప్రార్ధనా స్థలంపై అటాక్ చేశారు. ఈ ఘాతుకంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాయబారి ఇరాజ్ ఇలాహి నివాళులర్పించారు.

భారత్‌కు ముడిచమురును గతంలో సరఫరా చేశామని.. భారత్‌కు ముడిచమురు సరఫరా చేసే మొదటి మూడు దేశాల్లో ఇరాన్ ఒకటని రాయబారి ఇరాజ్ ఇలాహి అన్నారు. భారత్‌కు ఎట్టిపరిస్థితుల్లో మళ్లీ ముడిచమురు సరఫరా చేస్తామని అనేక సార్లు చెప్పినట్లు గుర్తుచేశారు. భారత్‌కు ముడిచమురును సరఫరా చేసే దేశాల్లో రష్యా మొదటి స్థానంలో ఉండగా.. సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. ఇక ఇరాన్ మూడవ స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత‌లో పెట్రోల్ రేటు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది. ఇరాన్ గనుక సరఫరాను పునరుద్ధరిస్తే.. భారత్‌లో పెట్రోల్ రేటు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×