Nithin Venky Kudumula :మెగాస్టార్ చిరంజీవి కంటిన్యూగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న రెండు చిత్రాలు వాల్తేరు వీరయ్య.. భోళా శంకర్. ఈ రెండింటిలో వాల్తేరు వీరయ్య వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. మరో చిత్రం భోళా శంకర్ సమ్మర్‌లో రిలీజ్ కానుంది. కాగా.. చిరంజీవి నెక్ట్స్ మూవీ ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే నెక్ట్స్ మూవీని మెగాస్టార్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో చేాయాలని అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడా సినిమాను చిరు పక్కన పెట్టేశారు. దీంతో వెంకీ కుడుముల అదే కథతో కొన్ని ప్రొడక్షన్ హౌసెస్‌ని కాంటాక్ట్ అయ్యాడు. ఛలో, భీష్మ వంటి వరుస సినిమాలతో హిట్ కొట్టిన ట్రాక్ రికార్డ్ ఉండటంతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెంకీ కుడుముల సినిమాను నిర్మించటానికి రెడీ అయ్యింది.
భీష్మ తర్వాత హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్.. వెంకీ కుడుముల సినిమా అనగానే మరో మారు ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేశారట. త్వరలోనే నితిన్, మైత్రీ మూవీ మేకర్స్, వెంకీ కుడుముల కాంబినేషన్ మూవీ స్టార్ట్ అవుతుందని సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు. భారీ హీరోల సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ తమ నెక్ట్స్ మూవీని నితిన్‌తో చేయనుంది. త్వరలోనే అనౌన్స్‌మెంట్ వస్తుందని టాక్.