BigTV English

Iran vs Israel war fear: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, అంతా రెడీ, బటన్ నొక్కడమే..!

Iran vs Israel war fear: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, అంతా రెడీ, బటన్ నొక్కడమే..!

Iran vs Israel war fear: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా? దాడులు చేసేందుకు అన్ని అస్త్రాలను ఇరాన్ సిద్ధం చేసిందా? డైరెక్ట్‌గా చేస్తుందా లేక ఇన్ డైరెక్ట్‌గా చేస్తుందా? ఒకవేళ ఇరాన్ దాడులు చేస్తే.. ఇజ్రాయెల్ తిప్పికొట్టే సామర్ధ్యముందా? ఒక వైపు హమాస్,మరోవైపు హిజ్బుల్లాలు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ దాడి చేస్తే కౌంటరిస్తుందా? చేసేవి సైబర్ దాడులా? మిస్సైల్స్ దాడులా? నౌకాదాడులు చేస్తాందా? ఇవే ప్రశ్నలు అక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి.


ఇజ్రాయెల్‌లో ఏం జరిగింది?

ఇజ్రాయెల్- హమాస్ మధ్య వార్ కొనసాగుతోంది. గాజా ప్రాంతంలో ఎక్కడ చూసినా ధ్వంసమైన భవనాలు కుప్పలు తెప్పులుగా దర్శనమిస్తున్నాయి. వేలాది మంది మరణించారు. తినడానికి తిండి దొరక్క లక్షలాది మంది వలసపోతున్నారు. ఇదే క్రమంలో దక్షిణ లెబనాన్‌లోని ఉగ్రవాద సంస్థకు చెందిన హిజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకగా హిజ్‌బొల్లా గ్రూప్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇప్పుడు ఇరాన్ వంతైంది. ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు 100 క్రూయిజ్ మిస్సైల్స్, వందలాది డ్రోన్లను సరిహద్దు ప్రాంతంలో మెహరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని చెప్పి నప్పటికీ ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ దేశ సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనం.

ఇరాన్ వార్నింగ్ వెనుక..?

ఏప్రిల్ ఒకటిన సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఇందులో ఆ దేశానికి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కీలక సైనికాధికారులు మరణించారు. ఈ దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ఎక్కడా ప్రకటించలేదు. అప్పుటి నుంచి ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ దాడి వెనుక కచ్చితంగా ఇజ్రాయెల్ ఉంటుందని భావిస్తుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై దాడి తప్పదని హెచ్చరించింది. ఇది తమ భూభాగం మీద దాడి చేయడమేనని దీనికి  ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదని ఆ దేశ అధినేత అయేతుల్లా ఖమేని హెచ్చరించారు.


అమెరికా ఏం చేస్తోంది?

ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాక్ దాడి చేసే సంకేతాలు ఉన్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రియాక్ట్ అయ్యారు. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సిద్ధమైందన్నారు. దాడికి మాత్రం ఎంతో సమయం లేదన్నారు. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు మేము కట్టుబడి ఉన్నామన్నారు. చేయకండి అంటూ ఇరాన్‌కు సందేశం పంపింది.  మరోవైపు అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు బలగాలను విధ్వంసక నౌకలు, సైనిక సామాగ్రిని పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఒకవైపు సైనికులను సిద్ధం చేస్తూనే.. మరోవైపు దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది అమెరికా.

బలగాల మాటేంటి?

బలగాల విషయంలో ఇరాన్ కంటే ఇజ్రాయెల్‌దే పైచేయి. కాకపోతే వార్ షిప్‌లు తప్పితే అన్నింటిలోనూ ఇజ్రాయెల్ సామర్థ్యం ఎక్కువే. కొంతకాలంగా హమాస్‌తో వార్ జరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్‌పై దాడి చేయడం అంత సులువు కాదన్నది కొందరి అంతర్జాతీయ నిపుణుల వాదన. ఇరాన్ కూడా డైరెక్ట్ వార్ చేయకపోవచ్చని అంటున్నారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుందని అంటున్నవాళ్లూ లేకపోలేదు. ముఖ్యంగా హిజ్‌బొల్లా, హమాస్ సంస్థల ద్వారానే వార్ చేసే అవకాశం ఉంటుందన్నది మరికొందరి వాదన. క్షణక్షణం ఏం జరుగుతుందో చూడాలి.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×