BigTV English

Israel – Gaza War : గాజా గజ గజ.. 24 గంటల్లో 700 మందికి పైగా మృతి

Israel – Gaza War : గాజా గజ గజ.. 24 గంటల్లో 700 మందికి పైగా మృతి

Israel – Gaza War : ఇజ్రాయెల్ దాడులతో గాజా గజగజలాడుతోంది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ఫోర్స్‌ చేసిన దాడుల్లో ఒక్క రోజే ఏకంగా 700 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. గాజా స్థానిక పాలనాధికారులు ఈ ప్రకటన చేశారు. రెండు వారాలుగా దాడులు కొనసాగుతున్నప్పటికీ ఒక్కరోజులోనే ఇంత భారీ సంఖ్యలో మృతి చెందటం ఇదే తొలిసారి అని చెప్పాలి.


మరోవైపు మొత్తం 400 హమాస్ టార్గెట్లపై దాడులు చేశామని, పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అయితే హమాస్‌ గ్రూప్‌ను తుద ముట్టించడానికి మరింత సమయం పడుతుందని తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ సృష్టించిన నరమేధానికి ప్రతీకారంగానే ఈ దాడులను జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ తెలుపుతోంది. మరణాల సంఖ్యను పెంచి అంతర్జాతీయ సమాజంలో సానుభూతి పొందే ప్రయత్నం పాలస్తీనా చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇప్పటికే గాజాను ఖాళీ చేయాలని సూచించామని.. కానీ ప్రజలు తరలి వెళ్లకుండా హమాస్‌ అడ్డుకుంటోందని చెబుతోంది.

ఇజ్రాయెల్ – హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రాయబారి ఆర్ రవీంద్ర ఇదే అంశంపై మాట్లాడారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ప్రాణనష్టం గురించి భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. గాజా స్ట్రిప్ లోని ప్రజలకు మానవతా సాయం చేయడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. గాజాకు 38 టన్నుల ఆహారం, కోట్లు విలువ చేసే వైద్య పరికరాలను పంపినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ -పాలస్తీనా మధ్య సామరస్యపూర్వక చర్చలు జరిపేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు.


ఇజ్రాయెల్‌కు అమెరికా మరోసారి తన మద్దతు ప్రకటించింది. అలాగే ఇజ్రాయెల్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. గాజాపై గ్రౌండ్ అటాక్‌ను వాయిదా వేయాలని బైడెన్ యంత్రాంగం ఇజ్రాయెల్‌కు సూచించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు బైడెన్‌ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ గాజా సరిహద్దులో సైన్యం ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే గాజా సరిహద్దులో భారీగా సైన్యాన్ని, యుద్ధ సామాగ్రిని మోహరించింది ఇజ్రాయెల్. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే దాడి చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది.

సిరియాలోని మిలటరీ స్థావరాలను టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్‌ దాడులు జరుపుతోంది. ఇప్పటికే సిరియాలోని రెండు ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లను పనికి రాకుండా చేసిన ఇజ్రాయెల్.. ఈ సారి వ్యూహాత్మక మిలటరీ స్థావరాలను, మోర్టార్‌ లాంచింగ్ సైట్లు టార్గెట్‌గా దాడులు చేసింది. గాజాలో గ్రౌండ్‌ ఆపరేషన్‌ ప్రారంభం కాగానే లెబనాన్, సిరియా వైపు నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ముందు జాగ్రత్తగా ఈ రెండు దేశాల నుంచి ఎవరూ చొచ్చుకు రాకుండా.. దాడులు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.

ఇక హమాస్‌కు పూర్తి మద్ధతును ఇస్తుందన్న అనుమానంతో ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అమెరికా. తాము ఇరాన్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. కానీ తమ పౌరులపై దాడులు జరిగితే మాత్రం ఊరుకునేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Related News

California: చెట్టును తాకి లైవ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Big Stories

×