Israel Strike on Iran Airbase: పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్- ఇరాన్‌ల మధ్య మాటలు కాస్తా యుద్దానికి దారి తీసింది. రెండురోజుల కిందట ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణుల దాడి చేసింది. దాన్ని ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌పై అర్ధరాత్రి దాడి చేసింది ఇజ్రాయెల్. దశాబ్దాల తర్వాత ఇజ్రాయెల్ చేసిన అతి పెద్ద ఎటాక్ ఇదేనని రక్షణ రంగ నిఫుణులు చెబుతున్నమాట.
ఇరాన్‌లో శుక్రవారం ఎర్లీ మార్నింగ్ సమయంలో భారీ ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి. దీన్ని ఇరాన్ స్పేష్ ఏజెన్సీ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌లో న్యూక్లియర్ సెంటర్లకు కేంద్రంగా ఉన్న ఇన్ఫహాన్ సిటీలో భారీ శబ్దాలు వినిపించినట్టు తేలింది. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఈక్రమంలో ఆ దేశ గగనతలాన్ని మూసివేసింది. విమానాలకు అనుమతులను రద్దు చేసింది. ఈ సిటీలో అతిపెద్ద సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఇజ్రాయెల్ డోన్లు, మిస్సెల్ దాడులు చేసినట్టు సమాచారం. మూడు డ్రోన్లను కూల్చివేసినట్టు ఇరాన్ స్పేష్ ఏజెన్సీ చెబుతోంది. ఈ క్రమ్ంలో ఇరాన్ ఎయిర్ బేస్ యాక్టివేట్ అయ్యిందని తెలుస్తోంది. కానీ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మాత్రం ఎలాంటి క్షిపణి దాడి జరగలేదని చెబుతోంది. కొద్దిగంటల్లో ఇరుదేశాల మధ్య ఏం జరిగిందో తెలియనుంది. మరి ఇజ్రాయెల్‌పై ఇరాన్ మళ్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది చూడాలి.
Also Read: Dubai Floods: ‘దుబాయ్ పర్యటనలను రీషెడ్యూల్ చేసుకోండి’.. భారత ఎంబసీ కీలక సూచనలు
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇజ్రాయెల్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవని, అక్కడ ఉంటున్న తమ దేశ పౌరులు స్వదేశానికి రావాలని ఆస్ట్రేలియా కోరింది. దాడుల నేపథ్యంలో గగనతలాన్ని మూసివేసే ఛాన్స్ ఉంటుందని హెచ్చరించింది.
🚨🇮🇷 TEHRAN'S IMAM KHOMEINI INTERNATIONAL AIRPORT (IKA) ALL FLIGHTS CANCELED
They told passengers that they should exit the airport.pic.twitter.com/BduPlIhSGJ https://t.co/kn7Md1a8w0
— Mario Nawfal (@MarioNawfal) April 19, 2024